Sunday, September 8, 2024

కేసీఆర్‌, కేటీఆర్‌ హామీ ఇచ్చారు: వనమా

- Advertisement -

సుప్రీంలో వనమాకు ఊరట..  హైకోర్టు తీర్పుపై స్టే

kcr-and-ktr-assured-themselves-vanama
kcr-and-ktr-assured-themselves-vanama

వాయిస్ టుడే: తనపై తెలంగాణ హైకోర్టు విధించిన వేటును సవాల్‌ చేస్తూ కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. న్యాయమూర్తులు జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా ధర్మాసనం ముందుకు ఈ పిటిషన్‌ విచారణకు వచ్చింది. ప్రాథమిక విచారణ అనంతరం వనమాకు ఊరటనిస్తూ ఆదేశాలు జారీ చేసింది అత్యున్నత ధర్మాసనం. ఆయనపై అనర్హత వేటు వేస్తూ.. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లోగా కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణ 4 వారాలకు వాయిదా వేసింది. ఎమ్మెల్యేగా వనమా వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదని గత నెల 25న తెలంగాణ హైకోర్టు తీర్పు చెప్పింది. అంతే కాకుండా జలగం వెంకటరావును ఎమ్మెల్యేగా ప్రకటించింది. ఎన్నికల అఫిడవిట్‌లో తప్పుడు వివరాలు పొందుపరిచారని ఆరోపిస్తూ వనమా వెంకటేశ్వరరావుపై BRS తరపున పోటీ చేసిన జలగం వెంకట్రావు హైకోర్టును ఆశ్రయించారు.భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏకైక జనరల్ స్థానం కొత్తగూడెం.. ఇక్కడి నుంచి వనమా వెంకటేశ్వరరావు 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి విజయం సాధించారు..కొద్ది రోజుల తర్వాత గులాబీ గూటికి చేరారు.. కొడుకు రాఘవ కేసుల వ్యవహారంతో వనమా ఇమేజ్ డ్యామేజ్ అయ్యిందని కొత్తగూడెం మొత్తం కోడై కూస్తోంది. అందుకే వనమాకు ఈ సారి టిక్కెట్‌ డౌటేనని సొంత పార్టీ నేతలే ప్రచారం చేస్తున్నారట.. ఇదే వనమాకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోందట. అయితే.. తనకు సవాళ్లు ఎదుర్కోవడం కొత్త కాదంటున్నారు వనమా.. కొత్తగూడెం నియోజకవర్గం తనకు తల్లిలాంటిదని.. మళ్లీ గెలిచేది కూడా తానేనని.. ఎవరి బెదిరింపులకు భయపడే ప్రసక్తేలేదని చెబుతున్నారు.. వచ్చే ఎన్నికల్లో కొత్తగూడెంలో టిఆర్ఎస్ అభ్యర్థిని తానేనని.. కేసీఆర్‌, కేటీఆర్‌ తనకే హామీ ఇచ్చారని.. తననెవరూ ఏమీ చేయలేరని చెప్పకుంటునర్నారు. తనకు అన్యాయం చేయాలనుకేవాళ్లే..మట్టి కొట్టుకుపోతారంటూ శాపనార్థాలు పెడుతున్నారు. మరోవైపు, జీఎస్సార్ ట్రస్ట్ హెల్త్ క్యాంపులు, విద్య, వైద్య సహాయం అంటూ కొత్తగూడెంలో హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాస్ రావు హడావుడి చేస్తున్నారు. జనహిత వేదికగా తన సామాజిక వర్గ నేతలతో మంతనాలు జరుపుతున్నారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ టిక్కెట్‌ శ్రీనివాసరావుకేనని ఆయన వర్గం చాపకింద నీరులా ప్రచారం చేస్తోంది.ఇటీవల మారిన రాజకీయ సమీకరణాలతో టిఆర్ఎస్, సీపీఐ మధ్య పొత్తు ఉంటుందని.. ఇరు పార్టీల నేతలు ప్రకటిస్తున్నారు.. సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కొత్తగూడెం నుంచి ఆ పార్టీ తరపున పోటీ చేస్తారని.. టాక్ నడుస్తోంది.. పొత్తుల్లో భాగంగా.. కొత్తగూడెం సీపీఐకి ఇస్తారని చెప్పుకుంటున్నారు. టీఆర్ఎస్ పొత్తుతో, వామపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా కొత్తగూడెం టికెట్ కూనంనేనికే ఖాయమంటున్నారు సీపీఐ శ్రేణులు.. కొత్తగూడెం జనరల్ స్థానం కావడంతో అందరి కన్ను ఈ నియోజకవర్గంపైనే పడింది. దీంతో వనమాకు ఎక్కడ లేని టెన్షన్‌ పడుకుందని జోరుగా ప్రచారం జరుగుతోంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్