- Advertisement -
*గోపీనాథ్ పార్థివదేహాన్ని సందర్శించి నివాళులర్పించిన కేసీఆర్*
KCR visits Gopinath's mortal remains and pays tributes
— తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పార్థివదేహాన్ని సందర్శించి ఘనంగా నివాళులర్పించారు.మాదాపూర్ డాక్టర్స్ కాలనీలోని గోపీనాథ్ నివాసంలో ఉంచిన ఆయన భౌతికకాయాన్ని కేసీఆర్ సందర్శించి పూలదండ వేసి శ్రద్ధాంజలి ఘటించి, కుటుంబ సభ్యులను ఓదార్చి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఈ సందర్భంగా కేసీఆర్ వెంట పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు, ఎంపీ రవిచంద్ర, ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ కుమార్,మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు, ఎమ్మెల్యేలు పద్మారావు గౌడ్,కొత్త ప్రభాకర్ రెడ్డి,మాజీ ఎమ్మెల్యే భాస్కరరావు తదితరులు ఉన్నారు
- Advertisement -