Saturday, March 7, 2026

అబద్దాల ఎంపీపీ నోరు అదుపులో పెట్టుకో

- Advertisement -

బిఆర్ఎస్ పార్టీ మంథని మండల యూత్ అధ్యక్షుడు కొండ రవీందర్

మంథని: మంథని ఎంపీపీ నోరు అదుపులో పెట్టుకోకపోతే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని బిఆర్ఎస్ పార్టీ మంథని మండల యూత్ అధ్యక్షుడు కొండ రవీందర్ అన్నారు. శనివారం మంథనిలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాజకీయంగా భూస్థాపితమైన కొండ శంకర్ ను చేరదీసి టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షునిగా ఎంపీటీసీగా ఎంపీపీగా చేసి రాజకీయ జీవితాన్ని మళ్లీ అందించిన గొప్ప వ్యక్తి పుట్ట మధుకర్ కాదా అని ప్రశ్నించారు.  కొండా శంకర్ ఆర్థికంగా చితికిపోయిన సమయంలో పుట్ట మధుకర్ తన సొంత డబ్బులతో ద్విచక్ర వాహనాన్ని కొనుగోలు చేసి ఇవ్వడంతో పాటు పిల్లల ఉన్నత చదువుల కోసం లాప్టాప్ లు అందించిన మాట వాస్తవం కాదా అన్నారు.పుట్ట మధుకర్ తో ఆర్థిక సాయంతో పాటు,రాజకీయ లబ్ధి పొంది నేడు ఆయనపై విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసమన్నారు. పుట్ట మధుకర్ తో తిరిగి తాను 15 ఎకరాలు అమ్ముకున్నానని ఎంపీపీ కొండా శంకర్ ప్రచారం చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. విలోచవరం గ్రామంలో ఊరుకొల్పు చేస్తే రూపాయి సహాయం చేయని నువ్వు పుట్ట మధుకు ఖర్చు చేశావంటే ఎవరు నమ్మరు అన్నారు.  15 ఎకరాల భూమి అమ్ముకొని  రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడిగా పెట్టుకున్న విషయం అందరికీ తెలుసు అన్నారు. ఊరికి ఐదు పైసలు సాయం చేయండి నీవు 15 ఎకరాలు అమ్మి పార్టీ కోసం ఖర్చు పెట్టానని చెప్పుకోవడం సిగ్గుచేటు అన్నారు.  విలోచవరం గ్రామంలో చెరుల పక్కన ఉన్న శిఖం భూములను కబ్జా చేసిన మాట వాస్తవం కాదా కబ్జా చేసిన భూములను గ్రామంలోని దళితులకు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ఊరి కొలుపు కోసం ఎంపీపీగా అత్యున్నత పదవిలో ఉండి  రూపాయి సాయం చేయలేదని ఉన్నారు గ్రామంలో ఉన్న ప్రజలు తలవో చేసి ఊరుకొలుపును ఘనంగా నిర్వహించుకున్నారని గుర్తు చేశారు. ఒక్క రూపాయి కూడా సాయం చేయకుండా పబ్బం గడిపిన మాట వాసం కాదా అన్నారు. అవినీతి అక్రమాలతో అబద్ధాలతో రాజకీయం జీవితం గడుపుతున్న కొండా శంకర్ వల్ల ఆయన ఇంటి పేరుతో ఉన్న మేము కూడా సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. మా ఇంటి పేరు కూడా కొండ అని చెబితే మమ్మల్ని కూడా అవినీతిపరులుగా ప్రజలు చూస్తారన్న భయం మాకు కలుగుతుందన్నారు. ఎంపీపీ కొండ శంకర్ విలోచావరం గ్రామంతో పాటు మండలంలోని ప్రజలందరికీ తెలుసునని ఇలాంటి చిల్లర మల్లర మాటలతో రాజకీయాలు చేస్తే సహించేది లేదన్నారు.మరి కొద్ది రోజుల్లో ఎంపీపీ కొండ శంకర్కు, కాంగ్రెస్ పార్టీకి ప్రజలే తగిన బుద్ధి చెప్తారన్నారు .ఈ కార్యక్రమంలో యూత్ నాయకులు బడికల సది, ఆసిఫ్ ఖాన్, ఇర్ఫాన్, నాంపల్లి దేవయ్య ,రవీందర్ రెడ్డి లు ఉన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్