Thursday, November 7, 2024

ఖమ్మం కార్పొరేషన్ 9వ డివిజన్  బిఆర్ఎస్ పార్టీ నాయకులు భారతీయ జనతా పార్టీలోకి చేరికలు  

- Advertisement -

ఖమ్మం కార్పొరేషన్ 9వ డివిజన్  బిఆర్ఎస్ పార్టీ నాయకులు భారతీయ జనతా పార్టీలోకి చేరికలు  

Khammam Corporation 9th Division BRS Party Leaders join Bharatiya Janata Party

ఖమ్మం  :
కార్పొరేషన్ 9వ డివిజన్ బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు బిజెపి అర్బన్ టౌన్ అధ్యక్షులు కుమిలి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో  షేక్ హుస్సేన్, షేక్ జమీల్ అహ్మద్, చందాల నరేందర్ లను, బీజేపీ రాష్ట్ర నాయకులు తాండ్ర వినోద్ రావు వారినీ బీజేపీ కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు. ఈ సందర్భగా పార్టీలో చేరిన నాయకులు మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా నరేంద్ర మోడీ ఈ దేశానికి చేస్తున్న సేవలు, పేద ప్రజలకోసం ప్రవేశపెడుతున్న పథకాలు, అలాగే భారత దేశాన్ని ప్రపంచంలో సుపర్ పవర్ దేశంగా తీర్చి దిద్దే టటువంటి సాహసోపేత నిర్ణయాలకు ఆకర్షితులై పార్టీ లో చేరామని చెప్పారు.
ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర నాయకులు తాండ్ర వినోద రావు  మాట్లాడుతూ గత రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు ఇటు రాష్ట్రాన్ని అటు దేశాన్ని అభివృద్ధి పథంలో నడపకుండా రాష్ట్ర దేశ ఆదాయాన్ని దోచుకున్నారని కాబట్టే దేశం 100 సంవత్సరాల అభివృద్ధి వెనుకబడిందని, ప్రియతమ నరేంద్ర మోడీ ప్రధాని అయిన తర్వాత ఈ దేశంలోని పేద ప్రజల కొరకు అనేక సంక్షేమ పథకాల ప్రవేశపెడుతున్నారని, ఎ ప్పుడు బ్యాంకు మెట్లు ఎక్కని ప్రజలు కూడా ఈరోజు బ్యాంకులో ఖాతా ఓపెన్ చేసి లావాదేవీలు నిర్వహిస్తున్నారు అని అది మోడీ గారి ఆలోచనకు వారి ముందు చూపుకు చాలా గర్వంగా ఉన్నదని,  అలాగే ఆడపిల్లల అభివృద్ధి కొరకు సుకన్య సమృద్ధి యోజన, వంటి అనేక కార్యక్రమాలు చేపట్టారని ఈరోజు ప్రపంచం లోనే భారతదేశం సూపర్ పవర్ కంట్రీగా ముందుకు దూసుకెళుతుందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈరోజు బిఆర్ఎస్ నుండి బీజేపీలో చేరిన నాయకులు నరేంద్ర మోడీ గారి ఆశయాలకు అదే విధంగా పార్టీ సిద్ధాంతాలు కట్టుబడి పని చేయాలని పేద ప్రజల పక్షాన నిలబడాలని 9వ డివిజన్లో పార్టీ ని మరింత ముందుకు తీసుకెళ్లాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో  అసెంబ్లీ కన్వీనర్ అల్లిక అంజయ్య, 7వ డివిజన్ కార్పొరేటర్ దొంగల సత్యనారాయణ, ఓబీసీ మోర్చ ఉపాధ్యక్షులు అంజయ్య, మహిళా మోర్చా జిల్లా కార్యదర్శి నీలిమ, సీతారాములు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్