- Advertisement -
రాహుల్ గాంధీ కామెంట్స్ పై కిషన్ ఫైర్
Kishan Fire on Rahul Gandhi's commentsశ్రీనగర్, సెప్టెంబర్ 11, (న్యూస్ పల్స్)
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విరుచుకుపడ్డారు. దేశంలో ఏం జరుగుతుందో రాహుల్ గాంధీకి అవగాహన లేదన్న కిషన్ రెడ్డి, జమ్మూ కాశ్మీర్ పవర్ పరిస్థితి గురించి ఆయనకు తెలియదన్నారు. ప్రస్తుతుం 18,000 మెగావాట్ల జలవిద్యుత్‌ను ఉత్పత్తి చేయడానికి జమ్మూ కాశ్మీర్‌కు అద్భుతమైన సామర్థ్యం ఉందని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ అతని ముందున్న 3 తరాల ప్రధానులకు ఈ విషయం తెలుసన్నారు.స్వాతంత్య్రానంతరం జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వం 1,197 మెగావాట్ల విద్యుత్‌ను మాత్రమే అందించిందన్నారు. మోదీ ప్రభుత్వం 2025-26 నాటికి మరో 3,014 మెగావాట్ల సామర్థ్యాన్ని పెంచుతున్నట్లు కిషన్ రెడ్డి ప్రకటించారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో, జమ్మూ అండ్ కాశ్మీర్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా విద్యుత్ కొనుగోళ్లపై రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ. 9,500 కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చింది. జమ్మూ కాశ్మీర్ విద్యుత్ లోటు 2018-19లో 17.8% నుండి 2023-24 సంవత్సరంలో 7.5%కి తగ్గించడం జరిగిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గుర్తు చేశారు.రాహుల్ గాంధీ ఎన్నికల టూరిస్ట్‌గా అభివర్ణించిన కేంద్ర మంత్రి, ఎన్నికల సమయంలో అతను ప్రచారం చేస్తాడు, సందర్భం, వాస్తవాలు లేకుండా చెత్తను చిమ్ముతాడు. ఆపై వెళ్లిపోతాడు. అ తర్వాత జరిగే పరిణామాలకు స్థానికనేతలు తలలు పట్టుకోవలసి వస్తుందన్నారు. ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ జమ్మూ కాశ్మీర్ ఎన్నికల సందర్భంగా చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ ఓడినంత మాత్రాన దేశంలో ప్రజాస్వామ్యం లేదని.. దేశ ప్రతిష్టకు భంగం వాటిల్లేలా.. ఇంగితం లేకుండా రాహుల్ మాట్లాడటం తగదని కిషన్ రెడ్డి అన్నారు. ఇటీవల అమెరికా పర్యటనకు వెళ్లిన రాహుల్ గాంధీ విదేశీ గడ్డపై భారత్ ప్రతిష్టను దిగజార్చడం ద్వారా మరోసారి తన దురుసు ప్రవర్తనను ప్రదర్శించారని కేంద్ర మంత్రి మండిపడ్డారు. భారత్‌కు వ్యతిరేకంగా పనిచేస్తున్న దేశ వ్యతిరేక శక్తులతో సమావేశమవుతున్న.. రాహుల్ వ్యవహారశైలి సరికాదన్నారు.అంత ముందు, జమ్మూ కాశ్మీర్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేయడానికి వచ్చిన రాహుల్ గాంధీ ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతూ, జమ్మూ కాశ్మీర్ దేశంలోని మిగిలిన ప్రాంతాలకు విద్యుత్‌ను అందజేస్తుండగా, జమ్మూ కాశ్మీర్ నివాసితులు దేశంలోని మిగిలిన ప్రాంతాల కంటే ఎక్కువ చెల్లిస్తున్నారని అన్నారు. దీంతో ఆయన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. గత దశాబ్ద కాలంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని భారత ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్లో యుద్ధ ప్రాతిపదికన విద్యుత్ సామర్థ్యాన్ని పెంచిదన్నారు. 2025-26 నాటికి మరో 3,014 మెగావాట్ల సామర్థ్యం పెరగనున్నట్లు కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. 2026 నాటికి, జమ్మూ కాశ్మీర్లో ఏటా మొత్తం 10,614 మిలియన్ యూనిట్ల శక్తి ఉత్పత్తి చేయడం జరుగుతుందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ పూర్తిగా అవగాహన లేమితో అబద్ధాలు, అర్ధసత్యాలు చెబుతూనే ఉన్నారు. అధికారంపై అతని జ్ఞానం కూడా ఇదే విధమైన అవగాహనా రాహిత్యాన్ని ప్రతిబింబిస్తుందని కిషన్ విరుచుకుపడ్డారు.
రాహుల్ కి కామన్ అయిపోయింది
లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలో చేసిన వ్యాఖ్యలు జాతీయ రాజకీయాలను మళ్లీ హీటెక్కించాయి. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ వరుస కార్యక్రమాల్లో పాల్గొంటూ పలు వ్యాఖ్యలు చేస్తున్నారు.. వాషింగ్టన్ డీసీలోని నేషనల్ ప్రెస్ క్లబ్లో జరిగిన కార్యక్రమంలో ప్రజాస్వామ్యం, భారతీయ జనతా పార్టీ తీరు, ఆర్ఎస్ఎస్, ఎన్నికలు, రిజర్వేషన్ల గురించి మాట్లాడారు. గత పదేళ్లలో భారతదేశ ప్రజాస్వామ్యం విచ్ఛిన్నమైందని, కానీ ప్రస్తుతం దానిని తిరిగి నిలబెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ వివరించారు. అయితే.. అమెరికాలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై హోం మంత్రి అమిత్ షా మండిపడ్డారు. దేశవ్యతిరేక మాటలు మాట్లాడటం, దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూసే శక్తులకు అండగా నిలవడం రాహుల్ గాంధీకి, కాంగ్రెస్ పార్టీకి అలవాటుగా మారిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా విమర్శించారు. విదేశీగడ్డపై భారత వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం ద్వారా దేశానికి చేటు కలిగిస్తున్నారని ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.గాంధీ విదేశీ గడ్డపై భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ దేశ భద్రత, మనోభావాలను దెబ్బతీస్తున్నారన్నారు.. భాషపరంగా, ప్రాంతంపరంగా, మతపరంగా విభజన మాటలు మాట్లాడటం రాహుల్ గాంధీ విభజన ఆలోచనను తెలియజెప్తోందని అమిత్ షా విమర్శించారు. రిజర్వేషన్ల గురించి రాహుల్ చేసిన వ్యాఖ్యలనూ అమిత్ షా తప్పుబట్టారు. దేశంలో రిజర్వేషన్‌ను రద్దు చేయాలనే ఉద్దేశంతో రాహుల్ గాంధీ మరోసారి కాంగ్రెస్ రిజర్వేషన్ వ్యతిరేక ముఖాన్ని దేశం ముందు తీసుకొచ్చారన్నారు. మనస్సులోని ఆలోచనలు ఎల్లప్పుడూ ఏదో ఒక రూపంలో బయటపడుతుంటాయి.. బీజేపీ ఉన్నంత కాలం రిజర్వేషన్‌ను ఎవరూ ముట్టుకోలేరని, దేశ సమైక్యతతో ఎవరూ ఆడుకోలేరని రాహుల్ గాంధీకి చెప్పాలనుకుంటున్నానంటూ అమిత్ షా స్పష్టంచేశారు.జమ్మూ కాశ్మీర్లో JKNC దేశ వ్యతిరేక, రిజర్వేషన్ వ్యతిరేక ఎజెండాకు మద్దతు ఇవ్వడం ద్వారా దేశ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నారని అమిత్ షా ఆగ్రహం వ్యక్తంచేశారు.
- Advertisement -




