అయోధ్య రాముడి అక్షింతలను పంపిణీ చేసిన కిషన్ రెడ్డి
హైదరాబాద్
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి మంగళవారం సికింద్రాబాద్, సీతఫల్ మండి, ఇందిరానగర్ బస్తీలలో పర్యటించారు. బస్తీ వాసులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఇందిరా నగర్ కమిటీ హాల్ లో ఉన్న బస్తీ దవాఖానను సందర్శించి పరిశీలించారు. లేర్నింగ్ స్కూల్ లో చదువుకుంటున్న చిన్నారులతో సరదాగా మాట్లాడారు.ఈ సందర్భంగా ఆ స్కూలు టీచర్స్ పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువెళ్లగా వాటిని పరిష్కరించి, అవసరమైన సదుపాయాలు కల్పిస్తామని వారికి హామీనిచ్చారు. అనంతరం అయోధ్య రాముడి అక్షింతల పంపిణీ కార్యక్రమంలో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. సీతాఫల్ మండిలో చేపట్టిన ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని ఇంటింటికీ అక్షింతలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ మాజీ మేయర్ బండ కార్తీక రెడ్డి, బీజేపీ సికింద్రాబాద్ మహంకాళి జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల సారంగపాణి, కలకంట్ల హరి, నాగేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అయోధ్య రాముడి అక్షింతలను పంపిణీ చేసిన కిషన్ రెడ్డి
- Advertisement -
- Advertisement -



