Sunday, September 8, 2024

కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి  అలిగారు

- Advertisement -

మరో దఫా సమావేశం …  కాంగ్రెస్‌ లో టికెట్ల కోసం కుస్తీ

Komati Reddy Venkat Reddy sold
Komati Reddy Venkat Reddy sold

హైదరాబాద్, సెప్టెంబర్ 7, (వాయిస్ టుడే):  తెలంగాణ కాంగ్రెస్‌లో టికెట్ల రేస్‌ కొనసాగుతోంది. ఇప్పటికే అధికార బీఆర్‌ఎస్‌ అభ్యర్థులను బరిలోకి దించితే.. కాంగ్రెస్‌ ఇంకా టికెట్ల కోసం కుస్తీ చేస్తునే ఉంది. ఒకటి రెండు కాదు.. మూడ్రోజులుగా స్క్రీనింగ్‌ కమిటీ అభ్యర్థుల జాబితాపై ఫుల్‌ స్కానింగ్‌ చేస్తునే ఉంది. అప్లికేషన్ల ప్రక్రియే పెద్ద ప్రసహనంలా సాగితే, ఆ దరఖాస్తుల వడపోత, రేసుగుర్రాల ఎంపికపై సుదీర్ఘంగా కసరత్తు కొనసాగుతునే ఉంది. సీనియర్లు, డీసీసీ అధ్యక్షులతో సమావేశమైన స్క్రీనింగ్‌ కమిటీ… తుది నిర్ణయం తీసుకునేందుకు మరో దఫా సమావేశం కావాలని నిర్ణయించింది. ఇదే సమయంలో.. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మరోసారి అలిగారు. సీడబ్ల్యూసీతోపాటు ముఖ్య కమిటీల్లో చోటు దక్కలేదని అలకబూనారు.

Komati Reddy Venkat Reddy sold
Komati Reddy Venkat Reddy sold

అభ్యర్థుల ఎంపికపై గత కొన్ని రోజులుగా తెలంగాణ కాంగ్రెస్‌ చేస్తున్న కసరత్తు ఒక కొలిక్కి వచ్చినట్టు కనిపిస్తోంది. హైదరాబాద్‌లో జరిగిన స్క్రీనింగ్‌ కమిటీ సమావేశం అన్ని వర్గాల అభిప్రాయాలు సేకరించింది. డీసీసీ అధ్యక్షులు, సీనియర్‌ నేతలతో స్క్రీనింగ్‌ కమిటీ సమావేశమైంది. కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి KC వేణుగోపాల్‌తో చర్చించిన తర్వాత కమిటీ మరోసారి సమావేశమై అభ్యర్థుల జాబితాను ప్రకటించే సూచనలు కనిపిస్తున్నాయి. సీడబ్ల్యూసీ సమావేశం ఏర్పాట్లను పరిశీలించేందుకు కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి హైదరాబాద్‌ చేరుకున్నారు.మరో వైపు కమిటీల్లో స్థానం కల్పించకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన భునవగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని సీనియర్లు బుజ్జగించారు. కోమటిరెడ్డి నివాసానికి మాణిక్‌రావ్‌ ఠాక్రే, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, AICC కార్యదర్శి సంపత్‌ వచ్చారు. కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి KC వేణుగోపాల్‌తో ఫోన్‌లో మాట్లాడించినట్టు తెలుస్తోంది. పదవుల విషయంలో నిరాశకు గురికావద్దని నచ్చజెప్పారు. కోమటిరెడ్డి అలక, బుజ్జిగింపుల గురించి అడిగిన ప్రశ్నలకు కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ మాణిక్‌రావ్‌ ఠాక్రే సమాధానం ఇవ్వలేదు. బ్రేక్‌ఫాస్ట్‌కు కోమటిరెడ్డి పిలిచారని, కుదరకపోవడంతో లంచ్‌కు వచ్చామని చెప్పారు. కాంగ్రెస్‌ను కోమటిరెడ్డిని విడదీయలేమని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. కోమటిరెడ్డి అలకపై భట్టి నేరుగా స్పందించలేదు.అటు AICC పరిశీలకురాలు దీపను సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కలిశారు. అభ్యర్థుల ఎంపిక, టికెట్ల కేటాయింపు విషయంలో పీసీసీ మాజీ అధ్యక్షుల సలహాలు తీసుకోవాలని సూచించారు. అంతే కాదు పొన్నాల లక్ష్మయ్య సహ మాజీ పీసీసీ చీఫ్‌లకు వచ్చే ఎన్నికల్లో టికెట్లు కేటాయించాలని కోరినట్టు తెలుస్తోంది.

కాంగ్రేస్ భారీ బహిరంగసభకు ఏర్పాట్లు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్