Wednesday, January 15, 2025

 కలకలం రేపుతున్న కోమటిరెడ్డి కామెంట్స్

- Advertisement -

 కలకలం రేపుతున్న కోమటిరెడ్డి కామెంట్స్
హైదరాబాద్, జనవరి 1,
గెలవాలంటే కలవాలనే టీకాంగ్రెస్ ఫార్ములా ఆసక్తిగా మారుతున్నది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నేతల మధ్య ఉన్న విభేదాలు పక్కన పెట్టి సమిష్టిగా కృషి చేసిన హస్తం నేతలు విజయం అందుకోగలిగారు. ఇక ప్రభుత్వంలోకి వచ్చాక సైతం అదే ఐక్యమత్యంతో ముందుకు సాగుతూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. కాంగ్రెస్ అంటేనే కలహాలు అనే మాట నుంచి.. కాంగ్రెస్ అంటే కమిట్ మెంట్ అనేలా పార్టీ నేతలకు అధిష్టానం దిశానిర్దేశం చేస్తోంది. ఈ క్రమంలో తాజాగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేస్తున్న వరుస ట్వీట్లు ఆసక్తిని రేపుతున్నాయి.నిన్న తాను, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కలిసి ఉన్న ఫోటోను షేర్ చేస్తూ.. కలిసి కొత్త శకాన్ని నిర్మిద్దాం అంటూ క్యాప్షన్ రాసుకొచ్చిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. ఇవాళ తాను, సీఎం రేవంత్ రెడ్డితో సలార్ మూవీ పాటతో రూపొందించిన వీడియోను ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ‘వేగమొకడు.. త్యాగమొకడు గతము మరువని గమనమే. ఒకరినొకరు నమ్మి నడిచిన బంధమే ఇదిలే. ఒకరు గర్జన.. ఒకరు ఉప్పెన వెరసి ప్రళయాలే. సైగ ఒకరు.. సైన్యం ఒకరు కలిసి కదిలితే కదనమే..’ అంటూ రాసుకొచ్చారు.కోమటిరెడ్డి ట్వీట్లు టీకాంగ్రెస్‌తో పాటు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఇంట్రెస్టింగ్‌గా మారుతున్నాయి. ఎన్నికలకు ముందు వరకు రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డికి మధ్య ఎడమొహం పెడమొహం అన్నట్లుగా వ్యవహారం సాగింది. కానీ ఆ తర్వాత వీరితో పాటు పార్టీ నేతలంతా కలిసికట్టుగా ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయగా మంత్రిగా కోమటిరెడ్డి బాధ్యతలు స్వీకరించారు. అయితే రాబోయే పార్లమెంట్ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి.అధికార పార్టీ హోదాలో అత్యధిక స్థానాలు గెలవడం హస్తం పార్టీ ముందున్న అతిపెద్ద టాస్క్. ఈ అచీవ్ మెంట్ సాధించాలంటే పార్టీ నేతలంతా సమిష్టిగా పని చేస్తే ఫలితాలలో మరింత మెరుగు పడవచ్చనే చర్చ జరుగుతున్న వేళ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తామంతా ఒక్కటే అంటూ ఐక్యతారాగం ఆలపించడం ఇంట్రెస్టింగ్‌గా మారింది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్