- Advertisement -
సినీ నటి సమంతపై తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నా: కొండా సురేఖ
Konda Surekha takes back her comments on Film actress Samantha
హైదరాబాద్ అక్టోబర్ 3
ప్రముఖ సినీ నటి సమంతపై తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నానని మంత్రి కొండా సురేఖ తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. “నా కామెంట్స్ ఉద్దేశం మహిళల పట్ల ఒక నాయకుడి చిన్నచూపు ధోరని ప్రశ్నించడమే కానీ మీ మనోభావాలు దెబ్బతీయడం కాదు. స్వయం శక్తితో మీరు ఎదిగిన తీరు నాకు ఆదర్శం. నా వ్యాఖ్యల పట్ల మీరు కానీ, మీ అభిమానులు కానీ మనస్థాపానికి గురైనట్లయితే బేషరతుగా నా వ్యాఖ్యలను వెనక్కి పూర్తిగా ఉపసంహరించుకుంటున్నాను” అని పేర్కొన్నారు.కాగా,మాజీ మంత్రి కెటిఆర్ వల్లే నాగచైతన్య-సమంత విడిపోయారని మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో ఫోన్ ట్యాపింగ్ ద్వారా అందరినీ ఇబ్బందులకు గురిచేశారన్నారు. కెటిఆర్ మత్తు పదార్థాలకు అలవాటు పడి హీరోయిన్లకు కూడా మత్తు పదార్థాలకు అలవాటు చేసి రేవ్ పార్టీలు నిర్వహించారని విమర్శించారు. బ్లాక్ మెయిల్ చేసి వాళ్ల జీవితాలతో కెటిఆర్ ఆడుకున్నారని ఆమె ఆరోపించారు.కెటిఆర్ తీరుతో సినీ పరిశ్రమలో కొంతమంది ఇబ్బంది పడ్డారని, కొందరు హీరోయిన్లు సినిమా ఫీల్డ్ నుంచి తప్పుకుంటే మరికొందరు త్వరగా పెళ్లి చేసుకున్నారని మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యానించారు. గతంలో ఎన్ కన్వేన్షన్‌ను కూల్చుతామని కెటిఆర్ సినీ హీరో నాగార్జునను బెదిరించారన్న ఆరోపణలు వచ్చాయని ఆ సమయంలో సమంత పేరు బయటకు వచ్చిందని, అందులో భాగంగానే సమంత, నాగచైతన్యకు విడాకులు అయ్యాయని మంత్రి కొండా సురేఖ ఆరోపించారు.
- Advertisement -