అయ్యప్ప స్వామి మహా పడి పూజ కార్యక్రమంలో పాల్గొన్న కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్.
కొండాపూర్ డివిజన్ పరిధిలోని ప్రేమ్ నగర్ బీ బ్లాకులో ఎనుముల వెంకటేష్ స్వామి, శ్యామల దంపతుల ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ అయ్యప్ప మహా పడి పూజ కార్యక్రమంలో కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ పాల్గొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి ఒక్కరికి ఆ అయ్యప్ప స్వామి కరుణ కటాక్షలు నిండుగా ఉండాలని, ఆ అయ్యప్ప స్వామిని ప్రార్ధిస్తున్నానని ఈ సందర్బంగా కార్పొరేటర్ హమీద్ పటేల్ అన్నారు.
కార్పొరేటర్ హమీద్ పటేల్ తో బాటుగా రూప రెడ్డి, వెంకటేష్, శ్యామల, మంగమ్మ, డా. రమేష్, గిరి గౌడ్, రామ స్వామి గౌడ్, యాదగిరి, సత్యం గౌడ్, వెంకటేశ్వర్ల రెడ్డి, వెంకట్ రెడ్డి, లావణ్య, రాజా శేఖర్, మంగలి కృష్ణ, నరేష్, సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.



