Tuesday, January 14, 2025

కేటీఆర్ విచారణ  కవిత ఆగ్రహం

- Advertisement -

కేటీఆర్ విచారణ  కవిత ఆగ్రహం

KTR Enquiry Kavitha Angry

హైదరాబాద్, జనవరి 6, (వాయిస్ టుడే)
ఏసీబీ ఆఫీసు వద్ద కేటీఆర్ వాహనం అడ్డుకుని, లాయర్లను అనుమతించకపోవడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ పై, తమ పార్టీ నేతలపై ఎన్ని కేసులు పెట్టిన భయపడేది లేదని ఎమ్మెల్సీ కవిత అన్నారు.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పర్యటనలో భాగంగా ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపం వద్ద బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, స్థానిక బిఆర్ఎస్ నాయకులతో కలిసి అమరులకు నివాళులు అర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఆదివాసి పోరాట యోధులకు సంబంధించినటువంటి ఈ ఇంద్రవెల్లి స్థూపం దగ్గర ఉండడం ఇవాళ నర నరాన వారు చేసినటువంటి ఆదివాసీలు భూమి భూక్తి కోసం వారు చేసినటువంటి త్యాగాన్ని ఒక పులకరింత లాగా ఉన్నది మరి వారి త్యాగాలను గుర్తుచేసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటూ వచ్చామన్నారు.
అమరులు ఏదైతే భూమి కోసం పోరాటం చేసారో తెలంగాణ రాష్ట్రంలోనే కేసీఆర్ ఈ మొత్తం యావత్ తెలంగాణ ప్రదేశంలో ఉండేటటువంటి గిరిజన ఆదివాసీ సోదరులందరికీ కూడా భూమి మీద హక్కులు ఉండాలని చెప్పి నాలుగున్నర లక్షల ఎకరాలకు భూమి హక్కులు అటవి హక్కులను రెండున్నర లక్షల ఎకరాల పైచిలుకు ఆదివాసి గిరిజనుల సోదరులకు ఇవ్వడం జరిగిందన్నారు. బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ హయాంలో మరి భుక్తి కోసం భూమి కోసం పోరాటం చేసినటువంటి వీరులందరినీ కూడా గౌరవించుకోవడం జరిగిందని, అటువంటి త్యాగం వారు చేసినటువంటి పోరాటం మమ్మల్ని ఇంకా ఉత్తేజమిస్తుంది. మాకు ప్రజల పక్షాన, ఆదివాసీల పక్షాన.. గిరిజనులు, మహిళలు, దళితులు, బహుజనుల పక్షాన పోరాటం చేసే స్ఫూర్తిని బిఆర్ఎస్ ప్రతి సైనికుడు ఇంద్రవెల్లి స్తూపం దగ్గర నుంచి తీసుకుంటామన్నారు. అమరవీరుల  త్యాగాలు, మరువలేని వారి పోరాటాలు మరువలేనివి. వారి పోరాట ఉత్తేజంతో ఉన్నటువంటి ఈ తెలంగాణలో మరి ఇప్పుడు నడుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రైతులకు అన్యాయం జరుగుతోందన్నారు.
మహిళల అన్యాయం జరుగుతోంది.. ఎవరైనా గొంతు ఎత్తి రైతుల పక్షాన.. మహిళల పక్షాన.. బహుజనుల పక్షాన మాట్లాడితే వెంటనే వారి మీద కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి ఉందన్నారు. ఇవాళ బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీద కూడా రకరకాల కేసులు పెట్టి కేసులు పెట్టి ఏసిబి పేరుతో ఇంకోదాని పేరుతోనే కక్షపూరితమైన వ్యవహారం ఈ ప్రభుత్వం చేస్తుందో తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తాఉన్నారన్నారు. మరి మీ ద్వారా మీడియా మిత్రులందరి ద్వారా ఇంద్రవెల్లి స్థూపం దగ్గర నుంచి తెలంగాణ బిడ్డలందరికి కూడా తెలియజేస్తున్నాం.. ఎట్లాంటి కేసులు పెట్టిన ఎవరు కూడా భయపడేది లేదు. ఖచ్చితంగా ప్రజల పక్షాన ప్రజలకు రావాల్సిన హక్కుల కోసం మా వానిని వినిపిస్తూనే ఉంటాం.. మా పోరాటం కొనసాగిస్తూనే ఉంటామన్నారు.
నిన్నటికి నిన్న ఈ ప్రభుత్వం మొదలు 15,000 ఇస్తాము ఎకరానికి రైతుకి రైతు భరోసా అని చెప్పి దాన్ని తగ్గించి 12,000 ఇస్తామని చెప్తే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పిలిపిచ్చింది ధర్నా చేస్తామని, ప్రభుత్వం మరి ఇటువంటి కక్షపూరితమైనటువంటి కేసులతో వేధించేటటువంటి కార్యక్రమం పెట్టుకున్నది.. ఈ విషయాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు.. ప్రజాకోర్టులో ఈ కాంగ్రెస్ ప్రభుత్వంకు శిక్ష తప్పదు అని, ఈ ఇంద్రవెల్లి స్తూపం దగ్గర నుంచి మేము చాలా సగర్వంగా తెలియజేస్తున్నామన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్