Tuesday, March 18, 2025

కేసీఆర్ కు కేటీఆర్‌, హ‌రీశ్ రావు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు*

- Advertisement -

కేసీఆర్ కు కేటీఆర్‌, హ‌రీశ్ రావు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు*

KTR, Harish Rao birthday wishes to KCR*

ఈరోజు బీఆర్ఎస్ అధినేత‌, మాజీ సీఎం కేసీఆర్ పుట్టిన‌రోజు సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్లువెత్తుతున్న బ‌ర్త్ డే విషెస్ నాన్న తెలంగాణ హీరో కావ‌డం త‌న అదృష్ట‌మ‌న్న కేటీఆర్‌ ‘తెలంగాణ ఉద్వేగం, ఉద్రేకం, ప్ర‌జాగ‌ళం కేసీఆర్’ అంటూ హ‌రీశ్ రావు ట్వీట్‌ ఈరోజు బీఆర్ఎస్ అధినేత‌, మాజీ సీఎం కేసీఆర్ పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు సోష‌ల్ మీడియా వేదిక‌గా సినీ, రాజ‌కీయ‌, ఇతర రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు, అభిమానులు బ‌ర్త్ డే విషెస్ తెలియ‌జేస్తున్నారు. తాజాగా ఆయ‌న కుమారుడు కేటీఆర్‌, మేన‌ల్లుడు హ‌రీశ్ రావు ఎక్స్ (ట్విట్ట‌ర్‌) వేదిక కేసీఆర్ కు పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. “ప్రతి తండ్రీ తమ బిడ్డకు హీరో. నా తండ్రి నా ఒక్కడికే కాదు, తెలంగాణకు కూడా హీరో కావ‌డం నా అదృష్టం. ఈ మాట‌కు ఆయన అర్థం ఏమిటో నిర్వచించారు కూడా. ఒక కల కనడం, దాని కోసం హద్దులేని నిబద్ధతతో బయలుదేరడం! విమర్శకులను ఎదుర్కోవడం, అది ఎలా నెరవేరుతుందో వారికి గర్వంగా చూపించడం! తెలంగాణ అనే కలను ప్రేమించడం, దాని కోసం పోరాడడం, మీ సొంత‌ జీవితం గురించి కూడా ఆలోచించకుండా దానిని సాధించడం! మీరు గర్వంగా మీ కొడుకు అని పిలుచుకునే వ్యక్తి కావడమే నా ఏకైక లక్ష్యం! ఈ పోరాటానికి, ఈ రాష్ట్రానికి, ఈ వారసత్వానికి అర్హుడిగా ఉండటానికి నా జీవితంలోని ప్రతి క్షణం కృషి చేస్తానని మీకు నా వాగ్దానం చేస్తున్నా. ప్రేరణతో నిండిన జీవితానికి ధన్యవాదాలు! పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్న” అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. తెలంగాణ ఉద్వేగం, ఉద్రేకం, ప్ర‌జాగ‌ళం, ఆత్మ‌గౌర‌వ ర‌ణం కేసీఆర్. మీరు నా తలనిమిరే తల్లిప్రేమ, నాకు ఎనలేని మమకారం పంచిన మేనమామ. నాకు రాజ‌కీయ చైత‌న్యాన్ని నేర్పించి, నాలో ప్రజా సేవా సంస్కారాన్ని రంగరించి, నన్ను ఉద్యమ కార్యాచరణలో నడిపించారు. త‌ద్వారా నాలోని నాయకత్వ గుణాన్ని ప్రేరేపించారు. నాకు పరిపాలనా సామర్థ్యాన్ని కల్పించి నన్ను చరితార్థుణ్ణి చేసిన మీరు శత వసంతాలు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను అని హ‌రీశ్ రావు త‌న ట్వీట్ రాసుకొచ్చారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్