- Advertisement -
పిడుగురాళ్లలో ప్రతి ఇంటికి కూటమి నాయకులు హాజరు
Kutami leaders to every house in pidugurallaప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల కరపత్రాలు పంపిణీ
పిడుగురాళ్ల
పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సీనియర్ శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు ఆదేశాల మేరకు ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని పిడుగురాళ్ల పట్టణంలోని 28,29 వార్డు నందు శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం, బిజెపి, జనసేన కూటమి నాయకులు సచివాలయ సిబ్బందితో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి ఈ వంద రోజుల్లో కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పిడుగురాళ్ల మండల అధ్యక్షుడు కామిశెట్టి రమేష్, తెలుగుదేశం పార్టీ నాయకులు కొల్లి తిరుపతిరావు, ఉన్నం ఆంజనేయులు, మేకల అంజి, భరద్వాజ్, జనసేన, తెలుగుదేశం,బిజెపి, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -




