0.1 C
New York
Wednesday, February 21, 2024

కరకంబాడిలో వడగ విప్పిన భూకబ్జా సర్పం

- Advertisement -

కరకంబాడిలో వడగ విప్పిన భూకబ్జా సర్పం

తిరుపతి

చెట్టు, పుట్ట,గుట్ట కాదేది కబ్జాకు అనర్హం ఆన్న చందాన భూ బకాసురులు కబ్జాలకు తెగబడుతున్నారు. పోలీస్ యంత్రాంగం, రెవెన్యూ యంత్రాంగం, కోర్టులను సైతం ధిక్కరిస్తున్నారు యదేచ్చగా కబ్జా పర్వాన్ని సాగిస్తున్నారు. తాజాగా కరకంబాడి వద్ద ఆటువంటి ఉదంతం ఒకటి చోటు చేసుకుంది వివరాల్లోకి వెళితే.
: కరకంబాడి గ్రామ లెక్క దాఖల భూమి కబ్జాకు గురైందని సిద్దాల రవిబాబు అనే బాధితుదు కలెక్టర్కు అర్జీ ఇవ్వడానికి గురువారం తిరుపతి కలెక్టరేట్ కు వచ్చారు. బాధితుడు రవిబాబు తెలిపిన వివరాల మేరకు  రేణిగుంట మండలం కరకంబాడి గ్రామ లెక్క దాకల 153/1 సర్వే నంబర్లలో గల 44 ఎకరాల 95 సెంట్లు భూమి కలదు అని వివరించారు. ఈ భూమికి సంబంధించి ప్రభుత్వం వారితో తమ కుటుంబానికి  దాదాపుగా 20 సంవత్సరాలుగా కేసు నడుస్తోందని అన్నారు. ఈ భూమి వారికి పిత్రార్జితంగా వచ్చిందని తెలిపారు. ఇటీవల కాలంలో 2018 లో ఈ కేసు పై ఇంజక్షన్ ఆర్డర్ పొందామని తెలిపారు. భూ సమస్య కోర్టు పరిధిలో ఉన్న ఈ తరుణంలో కొందరు స్థానికేతరులు జనవరి 26వ తేదీ నుండి అక్రమంగా భూమిలోకి చొరబడి స్థానిక ప్రజలను మారణాయుధాలతో భయభ్రాంతులకు గురి చేసి తాత్కాలిక డేరాలు వేసి ఆక్రమించుకుంటున్నారని ఆగ్రహించారు. మా గ్రామంలోని మహిళలను సైతం అసభ్యకరంగా మాట్లాడుతున్నారని మద్యపానం చేస్తూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని అన్నారు. పోలీసువారికి ఎమ్మార్వో వారికి విన్నవించుకున్నా కూడా  అక్రందనలు పట్టించుకోలేదని వాపోయారు. ఈ విషయమై తిరుపతి కలెక్టర్ వారు వెంటనే స్పందించి అక్రమణ దారుల వెనుక ఎవరి హస్తం ఉంది అనే కోణంలో విచారించాలని విన్నవించుకున్నారు అలాగే ఆక్రమణదారులను తరిమివేసి ప్రజలకు న్యాయవ్యవస్థపై  గల నమ్మకాన్ని నిలబెట్టాలని కోరుకున్నారు. ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరుకున్నారు.

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!