ఎల్బీనగర్ ను అభివృద్ధి చేస్తా: కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మధుయాష్కి గౌడ్
చంపాపేట డివిజన్ లో పాదయాత్ర
ఎల్బీనగర్, వాయిస్ టుడే:
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎల్బీనగర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మధుయాష్కి గౌడ్ ఎల్బీనగర్ నియోజకవర్గం చంపాపేట డివిజన్ లో పాదయాత్ర చేపట్టారు. ఇంటింటికి తిరుగుతూ తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని మధుయాష్కి గౌడ్ ఓటర్లను కోరారు. ఈ సందర్భంగా మధుయాష్కి గౌడ్ మాట్లాడుతూ ఎల్బీనగర్ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తనకు తెలుసునని, తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే సమస్యలు లేని నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని అన్నారు. రాబోయే ఎన్నికలలో హస్తం గుర్తుపై ఓట్లు వేసి తనను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రదేశ్ సేవాదళ్ అధ్యక్షులు మిద్దెల జితేందర్, పీసీసీ కార్యదర్శి జక్కిడి ప్రభాకర్ రెడ్డి, లింగోజిగూడ డివిజన్ కార్పొరేటర్ దర్పల్లి రాజశేఖరరెడ్డి, మాజీ కార్పొరేటర్ వజీర్ ప్రకాష్ గౌడ్, చంపాపేట డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీపాల్ రెడ్డి, అధిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.



