కడియం నర్సరీ ప్రాంతానికి “చిరుత”

- Advertisement -

కడియం నర్సరీ ప్రాంతానికి “చిరుత”

"Leopard" came to Kadiam Nursery Area

ఆలమూరు, మండపేట ప్రాతాల వాళ్లుకూడా అప్రమత్తంగా ఉండాలి
రాజమహేంద్రవరం
రాజమహేంద్రవరం దివానచెరువు అభయారణ్యం ప్రాంతంలో సంచరిస్తున్న చిరుత గత మూడు రోజులుగా జాడ లేకపోవడం తెలిసింది. అయితే మంగళవారం రాత్రి కడియం నర్సరీ ప్రాంతాల్లో చిరుత జాడ కనిపించిందని అడవి శాఖ అధికారులు  ధ్రువీకరించారు. దాంతో ఈ ప్రాంత ప్రజలు భయాందోళన చెందుతున్నారు. దివానచెరువు ప్రాంతం నుంచి ఈ చిరుత కడియం ప్రాంతానికి వచ్చినట్లు కాలి ముద్రల ద్వారా అధికారులు నిర్ధారించారు. అయితే కడియం- వీరవరం రోడ్ మధ్యలో ఉండే దోషాలమ్మ కాలనీలో ఈ చిరుత జాడలు కనిపించడంతో ఆ కాలనీ వాసులంతా  తీవ్ర భయాందోళన చెందారు. అడవి శాఖ అధికారులు ఈ ప్రాంతాన్ని పరిశీలించి చిరుత జాడల ఉన్నట్లు గుర్తించారు.అది అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది అనేది అంతుపట్టడం లేదు.కొన్ని నర్సరీలలో సీసీ కెమెరాలు ఉంటాయి. కాని ఇప్పుడు అందరూ భయపడి రైతులు ఎవరు నర్సరీలో ఉండడం లేదు. దీంతో చిరుత ఆ ప్రాంతంలోనే ఉందా అక్కడి నుంచి సమీపమైన ఆలమూరు లేదా మండపేట మండలాల పరిధిలోకి వెళ్ళిందా అనేది పెద్ద చర్చనీయాంశంగా మారింది. గంటకు సుమారు 100 కిలోమీటర్ల  వేగంతో పయనించే ఈ చిరుత ఎప్పుడు ఎక్కడికైనా వెళ్లగలగే అవకాశం ఉంటుంది. ఏదేమైనాప్పటికీ ఈ ప్రాంతాల్లో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అడవీ శాఖ అధికారులు  సూచిస్తున్నారు.ఎవరూ బయటకు రావద్దని,ఇంటి బయట లైట్లు వేసి ఉంచాలని,దగ్గరగా ఉండే మైకులు పలుకుతూ ఉండాలని సూచించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular