సీఎం సహాయ నిధికి విరాళాలు పంపుదాం

- Advertisement -

సీఎం సహాయ నిధికి విరాళాలు పంపుదాం

Let's send donations to the CM relief fund

 వరద బాధితులను మన వంతు ఆదుకుందాం
సచివాలయ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పులిబండ్ల నరసింహారావు పిలుపు
పిడుగురాళ్ల,
గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలను పంపాలని సచివాలయ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పులిబండ్ల నరసింహారావు ఉద్యోగస్తులను కోరారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ప్రస్తుతం ప్రజలు కష్ట సమయంలో ఉన్నందువలన అన్ని  సంఘాల ఉద్యోగులు తమకు చేతనైన సహాయం చేయవలసిందిగా నరసింహారావు విజ్ఞప్తి చేశారు. వరద సహాయక చర్యల్లో మానవతా దృక్పథంతో వ్యవహరించి ప్రభుత్వానికి పూర్తిగా సహకరించే అవసరం ఎంతైనా ఉందని ఆయన అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular