జర్నలిస్టు సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారమయ్యేలా చూస్తా

- Advertisement -

జర్నలిస్టు సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారమయ్యేలా చూస్తా

Let's take journalists problems to attention of CM and see that they are resolved

 – ఏపీయూడబ్ల్యూజే నాయకులతో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి

బనగానపల్లె,

బనగానపల్లె నియోజకవర్గంలోని ప్రింట్ అండ్ ఎలక్ట్రాన్ మీడియాలో  పనిచేస్తున్న జర్నలిస్టుల సమస్యలను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్లి వారి సమస్యలను పరిష్కారమయ్యేలా చూస్తానని  రాష్ట్ర ఆర్ అండ్ బి శాఖమంత్రి బీసీ జనార్దన్ రెడ్డి హామీ ఇచ్చారు. మంగళవారం నియోజవర్గ ఏపీయూడబ్ల్యూజే శాఖ ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా ఉపాధ్యక్షుడు మదార్ సాహెబ్ ,మండల శాఖ అధ్యక్షులు సయ్యద్ హుస్సేన్, ప్రధాన కార్యదర్శి గుండం హరికృష్ణ రెడ్డి, గౌరవ అధ్యక్షులు యు రాజశేఖర్ ల ఆధ్వర్యంలో నియోజవర్గంలోని ప్రింట్ అండ్ ఎలెక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు బనగానపల్లెలోని ఆయన పార్టీ కార్యాలయంలో కలిసి తమకు సంబంధించిన అపరిష్కృత  సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఒక వినతిపత్రాన్ని అందజేశారు. నియోజవర్గంలో  పనిచేస్తున్న జర్నలిస్టులకు   అక్రిడిటేషన్ తో సంబంధం లేకుండా అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించి ఇల్లు మంజూరు చేయాలని కోరారు. చిన్న పత్రికలకు గత ప్రభుత్వం హయాంలో అక్రిడిటేషన్ విషయంలో తీవ్ర అన్యాయం జరిగిందని ఎన్నికల్లో సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు నిబంధనలను సడలించి ప్రతి ఒక్కరికీ  అక్రిడిటేషన్ లు ఇవ్వాలని వారు కోరారు. అలాగే నియోజకవర్గ కేంద్రంలో ప్రెస్ క్లబ్ ఏర్పాటుకు స్థలం కేటాయించాలని వారు మంత్రికి విజ్ఞప్తి చేశారు. జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ స్కూళ్లలో 60 శాతం ఫీజు రాయితీ కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని వారు కోరారు. జర్నలిస్టుల సమస్యలు  సావధానంగా విన్న  మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వినతిపత్రంలో  చేసిన విజ్ఞప్తి మేరకు సీఎం  చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కారమయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మధు,సుబ్బయ్య, నాగేంద్రప్రసాద్, కిరణ్,హాజీ భాష, చండ్రాయుడు, సుభాష్,నవీన్ కుమార్, శివ రాముడు,పెద్దరాజు,శివ, రాజేష్,మహబూబ్ బాషా తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular