మట్టి వినాయక విగ్రహలను పూజిద్దాం

- Advertisement -

మట్టి వినాయక విగ్రహలను పూజిద్దాం

Let’s worship clay Ganesha idols

పిఠాపురం
పర్యావరణ హితంగా పండుగలు,ఉత్సవాలు జరుపుకుంటేనే మేలు అని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి,పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చిన విషయం అందరికీ విదితమే.ఈ నేపథ్యంలోనే పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం చేబ్రోలులోని ఆయన నివాసంలో మట్టితో చేసిన వినాయక విగ్రహాన్ని ఏర్పాటుచేసి ముందుగా తాను ఆచరించి అందరికీ స్ఫూర్తిగా నిలిచారు పవన్ కళ్యాణ్..
నా మట్టి,నా పిఠాపురం అనే నినాదంతో రానున్న వినాయకచవితి పండుగను మట్టితో చేసిన వినాయక విగ్రహంతో జరుపుకునేందుకు ఏర్పాట్లు చేస్తూన్నారు.చేబ్రోలులోని తన నివాసంలో మట్టి గోడలు,తాటాకు పందిరితో మండపం ఏర్పాటుచేసి,అందులో మట్టి వినాయక విగ్రహాన్ని ఉంచి పూజ జరిపేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తూన్నారు.ఈ విధంగా ప్రతీఒక్కరూ పర్యావరణ హితంగా పండుగలు,ఉత్సవాలు జరుపుకుంటేనే మేలు అని అంటూన్న  పవన్ కళ్యాణ్.,ముందు తాను ఆచరిస్తూ అందరూ ఆచరించాలని చెప్తూన్నారు..

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular