Sunday, September 8, 2024

మంత్రివర్గ విస్తరణ కోసం ఎదురు చూపులు

- Advertisement -

మంత్రివర్గ విస్తరణ కోసం ఎదురు చూపులు

హైదరాబాద్, డిసెంబర్ 23

తెలంగాణ మంత్రి వర్గ విస్తరణ కు ముహూర్తం ఖరారు అయిందా..పార్లిమెంట్ ఎన్నికల లోపే పూర్తి స్థాయి మంత్రివర్గ విస్తరణ ఉండబోతుందా..మంత్రి వర్గ విస్తరణ లో చోటు దక్కే నేతలు ఎవరు ?? ఓడిపోయిన నేతలకు క్యాబినెట్ లో అవకాశం కల్పిస్తారా?? గ్రేటర్ హైదరాబాద్ లో మంత్రి పదవి ఎవరికి దక్కనుంది??మంత్రి వర్గ కూర్పు పై తెలంగాణ కాంగ్రెస్ లో ఎలాంటి  చర్చ జరుగుతుంది.. తెలంగాణ క్యాబినెట్ లో  సీఎం తో కలుపుకుని మొత్తం  18 మంది కి అవకాశం ఉంటుంది.కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం లో సీఎం కాకుండా మరో 11 మందికి మంత్రి వర్గంలో చోటు కల్పించారు.ఇంకా 6 మంత్రి పదవులు కాలీగా ఉన్నాయి.
అయితే  ఉమ్మడి జిల్లా ల వారిగా చూస్తే ఖమ్మం లో 3, నల్లగొండ 2,వరంగల్ 2, మహాబూబ్ నగర్ లో సీఎం తో కలుపుకుని 2 ,మెధక్ లో 1 కరీంనగర్ 2 జిల్లా లలకు ఇప్పటి వరకు మంత్రి వర్గంలో చోటు కల్పించారు.. ఇక ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్ ,గ్రేటర్ హైదరాబాద్ ,రంగారెడ్డి జిల్లా లకు మంత్రి వర్గంలో చోటు లభించలేదు.  పూర్తి స్థాయి క్యాబినెట్ లో ఈ నాలుగు జిల్లాలకు అవకాశం తప్పక కల్పించాల్సి ఉంది.గ్రేటర్ హైదరాబాద్ లో 24 స్థానాలకు కాంగ్రెస్ పార్టీ ఒక్క ఎమ్మెల్యే కూడా గెలవలేకపోయింది.ఉమ్మడి రంగారెడ్డి లో వికారాబాద్ ,తాండూరు, పరిగి ,ఇబ్రహీంపట్నం స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది.. అయితే వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కు స్పీకర్ పదవి ఇవ్వగా పరిగి ఎమ్మెల్యే రాం మోహన్ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి మధ్య తీవ్రమైన పోటీ వుంది. అయితే సీనియర్ అయిన మల్ రెడ్డి రంగారెడ్డి కి మంత్రి పదవి ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక నిజామాబాద్ జిల్లాలో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాత్రమే సీనియర్..అయితే ఇంకా రెడ్ల కు క్యాబినెట్ లో అవకాశం కల్పిస్తారా..లేక ముస్లిం కోటా లో కామారెడ్డి సొంత నియోజకవర్గం రేవంత్ రెడ్డి కి త్యాగం చేసి, నిజామాబాద్ అర్బన్ నుంచి పోటీ చేసి ఓడిన షబ్బీర్ అలీ కి స్థానం కల్పిస్తారో చూడాలి.. ఉమ్మడి ఆదిలాబాద్ లో ప్రేమ్ సాగర్ రావు ,వివేక్ బ్రదర్స్ ఇద్దరు సీనియర్ నేతలు ఉండగా వెలమ కోటా లో ఇప్పటికే జూపల్లి కృష్ణారావు కు మంత్రి వర్గంలో చోటు కల్పించారు..
దీంతో ప్రేమ్ సాగర్ రావు కు అవకాశం ఇస్తారోలేదో చూడాలి.. మరో నేత వివేక్ మాల సామాజిక వర్గం నేత.. అయితే డిప్యూటీ సీఎం భట్టి‌‌ ,స్పీకర్ గడ్డం ప్రసాద్ మాల సామాజిక వర్గం నేతలు కావడం తో వివేక్ కు అవకాశం కల్పిస్తారా అనేది చూడాలి.. ఇక ఉమ్మడి హైదరాబాద్ లో అయితే కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యేలు లేరు కాబట్టి.. రానున్న గ్రేటర్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అంజన్ కుమార్ యాదవ్ కు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇస్తారనే టాక్ వినిపిస్తోంది. లేదంటే పాత బస్తీలో పార్టీ బలోపేతం పై దృష్టి పెట్టాలని ఎమ్మెల్యే గా ఓడిన మైనార్టీ ఫిరోజ్ ఖాన్ కి మంత్రి వర్గంలో ఖాయం గా కనపడుతుంది . ఇదిలావుంటే నల్గొండ జిల్లా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సైతం తనకు మంత్రి వర్గంలో స్థానం ఖాయం అని ధీమాతో ఉన్నారు.మరోవైపు ఎమ్మెల్సి జీవన్ రెడ్డి తో పాటు ,మాజీ మంత్రి చిన్నారెడ్డి కూడా తమకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు.ఏది ఏమైనా ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి జిలా లకు జిల్లా కు ఓక మంత్రి పదవి చొప్పున ఇవ్వాలనేది కాంగ్రెస్ ప్లాన్.. మరో రెండు మంత్రి పదవులు పార్టీ బలోపేతం కోసం కష్టపడ్డవారికి,మైనారిటీకి ఇవ్వాలని కాంగ్రెస్ ఆలోచిస్తోంది.దీంతో కాంగ్రెస్ కు ఎక్కడ ఎవరు అవసరం అనేదానిపై సమాలోచనలు చేస్తున్నారు.మొత్తానికి ఎది ఎమైనా పార్లిమెంట్ ఎన్నికల లోపు పూర్తి స్థాయి క్యాబినెట్ కూర్పు జరిగే అవకాశం కనిపిస్తోంది.. దీంతో చాలా మంది నేతలు క్యాబినెట్ లో బెర్త్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.. ఆ అదృష్టవంతులు ఎవరో తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్