8.3 C
New York
Friday, April 19, 2024

రాజ్యసభ పై కమలం గురి…

- Advertisement -

రాజ్యసభ పై కమలం గురి…
న్యూఢిల్లీ, జనవరి 30,
టార్గెట్‌.. హ్యాట్రిక్‌. 4 వందల ప్లస్‌ అంటూ లోక్ సభ పోల్‌ మిషన్‌ చేపట్టింది బీజేపీ. దిగువ సభలో బలం సరే. కీలక బిల్లుల క్లియరెన్స్‌కు కిరికిరిలేకుండా పెద్దల సభలో ఈసారి కమలదళం బలగం పెరుగనుందా? అంటే.. అవుననే చెబుతున్నాయి బీజేపీ శ్రేణులు.. ఇప్పటికే రాజ్యసభ ఎన్నికలపై స్పెషల్ ఫోకస్ చేసిన బీజేపీ.. ఎక్కువ స్థానాలను దక్కించుకునేందుకు వ్యూహాలను రచిస్తోంది. కాగా.. రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది.15 రాష్ట్రాల్లో ఖాళీ అయిన 56 రాజ్యసభ స్థానాల్లో ఎన్నికల కోసం ఫిబ్రవరి 8న నోటిఫికేషన్‌ రానుంది. నామినేషన్ల దాఖలకు తుది గడవు ఫిబ్రవరి 15… నామినేషన్ల పరిశీలన ఫిబ్రవరి 16న, నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు ఫిబ్రవరి 20 .ఇక పోలింగ్‌ ఫిబ్రవరి 27న జరుగుతుంది.ఫలితాలు ప్రకటన కూడా అదే రోజు ఉండనుంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల నుంచి 6 స్థానాలు కాళీ అవుతుండగా ఏపీలో మూడు, తెలంగాణలో మూడు సీట్లు భర్తీ కానున్నాయి.లోక్‌సభ ఎన్నికల్లో హ్యాట్రిక్‌ టార్గెట్‌గా బీజేపీ వ్యూహాలకు పదను పెడుతోంది. ఎట్‌ ద సేమ్‌ కీలక బిల్లుల క్లియరెన్స్‌ కోసం పెద్దల సభలో బలం పెంచుకోవడంపై కూడా ఫోకస్‌ పెట్టింది బీజేపీ. రాజ్యసభలో బలగం పెరిగితే పెండింగ్‌ బిల్లుల ఆమోదానికి లైన్‌ క్లియర్‌ అవుతుంది కాబట్టీ బలం పెంచుకునేలా వ్యూహ రచన చేస్తోంది. ప్రస్తుతం రాజ్యసభలో బీజేపీ సభ్యుల సంఖ్య 93. ఎన్‌డీఏ కూటమి ప్రకారం చేస్తే 114 మంది సభ్యులున్నారు. అసెంబ్లీ కోటాలో జరగున్న రాజ్యసభ ఎంపీ ఎన్నికల్లో బీజేపీ బలం కొంత పెరగనుంది.ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, చత్తీస్‌గఢ్‌లో బంపర్‌ విక్టరీ సాధించింది. మధ్యప్రదేశ్‌లో 4 రాజ్యసభ స్థానాలకు ఎన్నిక జరగబోతుంది. నాలుగుకు నాలుగు బీజేపీ ఖాతాలో చేరే అవకాశం మెండుగా వుంది. ఇక చత్తీస్‌ గఢ్‌లో ఒక స్థానం బీజేపీ కైవసం కానుంది. రాజస్థాన్‌లో గతంలో బీజేపీకి ఒకే ఒక రాజ్యసభ స్థానం ఉంది. ఇప్పుడు ఎన్నికలు జరగుబోయే మూడు స్థానాల్లో బీజేపీ రెండింటిని గెలుచుకునే చాన్స్‌ ఉంది. ఈ లెక్కన బీజేపీ ఖాతాలో మరో ఆరు రాజ్యసభ స్థానాలు చేరే అవకాశం వుంది. జేడీయూ జత కలిసింది కాబట్టీ ఎన్‌డీయేకు బీహార్‌ నుంచి మరో రెండు స్థానాలు యాడ్‌ అయ్యే అవకాశం ఉంది. .

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!