మాజీ కార్పొరేటర్ తూము శ్రావణ్ కుమార్
కూకట్ పల్లి ; అక్టోబర్ 30(వాయిస్ టుడే): కూకట్ పల్లి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా కూకట్ పల్లి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాధవరం కృష్ణారావు భారీ మెజారిటీతో గెలవాలని మూసాపేట్ డివిజన్ పాండురంగ నగర్ లోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మూసాపేట్ మాజీ కార్పోరేటర్ తూము శ్రావణ్ కుమార్ మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సోమవారం పాండురంగ నగర్ వీకర్ సెక్షన్ లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గతంలో పాండురంగ నగర్ వీకర్ సెక్షన్ లో వర్షాకాలం వచ్చిందంటే ముంపు సమస్యతో బాధపడేవారని, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సహకారంతో ఆ సమస్య లేకుండా చేస్తామని, ప్రజలకు ఎవరు మంచి చేశారో అలోచించి ఓటు వేయాలని కోరారు. ప్రజా సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ స్థానంలో ఉందని దానికి కారణం కేసిఆర్ అని ఆయన అన్నారు. బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోను ప్రజలకు వివరిస్తూ కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ సి.హెచ్ సత్యనారాయణ, డివిజన్ అధ్యక్షులు అంబటి శ్రీనివాస్, నాగుల సత్యం, ప్రధాన కార్యదర్శి తిరుపతి, నాని, ఉదయ్, రవీందర్, సత్యనారాయణ, మోహన్ రెడ్డి, రుద్రగౌడ్, చక్రపాణి, వినోద్, వెంకటేశ్వర రెడ్డి, జోసెఫ్, విష్ణు, వెంకటేశ్వర రావు, అబ్బులు,శ్రీనివాస్, యాదగిరి , శేఖర్, అశోక్ ,పుష్పలత,లత తదితరులు పాల్గొన్నారు.
