కంటోన్మెంట్, అక్టోబర్ 27 (వాయిస్ టుడే ప్రతినిధి): ఓల్డ్ బోయిన్ పల్లి డివిజన్ తో పాటు కూకట్ పల్లి నియోజకవర్గన్ని అభివృద్ధి చేస్తున్న, మాధవరం కృష్ణారావు ను మూడోసారి భారీ మెజార్టీతో గెలిపించాలని, ఓల్డ్ బోయిన్ పల్లి డివిజన్ కార్పొరేటర్ ముద్ధం నరసింహ యాదవ్ తెలిపారు. శుక్రవారం నాడు డివిజన్ పరిధిలోని గంగపుత్ర కాలనీ, ఫ్రెండ్స్ కాలనీ, కోయోబస్తీ, మందుల బస్తి, వివిధ బస్తీలలో, బిఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి, ముద్ధం నరసింహ యాదవ్, పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… దేశంలో ఎక్కడ ఈ విధంగా తెలంగాణ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ మాధవరం కృష్ణారావుకు ఓటు వేసి మూడోసారి భారీ మెజార్టీ గెలిపించుకోవాలని ఆయన ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మొక్కల నర్సింగ్ రావు, సయ్యద్ ఎజాజ్, డివిజన్ అధ్యక్షుడు ఇర్ఫాన్, ప్రధాన కార్యదర్శి మేకల హరినాథ్, డివిజన్ మహిళ అధ్యక్షులు లలిత, బుర్రి యాదగిరి, మట్టి శ్రీనివాస్, జాంగిర్, గణేష్ యాదవ్, చందు యాదవ్, పోచయ్య, పార్టీ నాయకులు మహిళలు తదితరులు పాల్గొన్నారు.