మాదిగ బిడ్డ గజ్జెల కాంతానికి కాంగ్రెస్ టికెట్ ఇవ్వాలి
-ప్రజాసంఘాల జేఏసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సురేందర్
పెద్దపల్లి
అంబేద్కర్ ఆశయాలను తమ స్వార్థానికి ఉపయోగించుకొని ఆర్థికంగా ఉన్నత శిఖరాలకు ఎదిగిన వ్యాపారులకు పెద్దపల్లి పార్లమెంటు స్థానాన్ని కేటాయించి మాదిగలకు అన్యాయం చేయవద్దని మాదిగ శక్తి వ్యవస్థాపకులు, ప్రజాసంఘాల జేఏసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరి సురేందర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని కోరారు. జిల్లా కేంద్రంలోని నందనగార్డెన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సన్ని మాట్లాడుతూ, వ్యాపారాలు, హోదాల కోసం రిజర్వేషన్లలను వాడుకునే వారిని దూరం పెట్టాలని, ఉధ్యమ నేపథ్యం కలిగిన ప్రజా సంఘాల జేఏసి నాయకుడు గజ్జెల కాంతానికే పెద్దపల్లి పార్లమెంటు సీటుని ఖరారు చేయాలని అన్నారు. ఇందులో భాగంగా ఇటీవల గాంధీభవనులో వెయ్యి మాదిగ డప్పులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, ఇతర మంత్రులకు విన్నవించినట్లు తెలిపారు. తెలంగాణాలో కుటుంబపాలనను అంతమొందించిన విధంగానే, కాంగ్రెస్ పార్టీలో సైతం కుటుంబ రాజకీయాలను మట్టిలో కలపాలని డిమాండ్ చేశారు. చాలా యేళ్ళుగా మాదిగలు కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నారన్న ఆయన రానున్న ఎన్నికల్లో గజ్జెల కాంతం అభర్థిత్వాన్ని ఖరారు చేస్తే మాదిగలతో పాటు అన్నివర్గాల మద్దతు కూడా పొందే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. అలాగే ఏఐసిసి కార్యాలయం ముందు మాదిగ డప్పులతో ప్రదర్శన చేపట్టనున్నట్లు వివరించారు. రిజర్వేషన్లను అడ్డంపెట్టుకొని అడ్డగోలుగా సంపాదించిన వారు సైతం రిజర్వుడు స్థానాలను ఆశించడం సిగ్గుచేటని విమర్శించారు. మాదిగేతరులకు టికెట్ కేటాయించి మాదిగలను అణగదొక్కే ప్రయత్నం చేయొద్దని సూచించారు. ఈ సమావేశంలో తెలంగాణ ప్రజాసంఘాల జేఏసీ జిల్లా అధ్యక్షులు పొన్నం సత్తయ్య గౌడ్, తెలంగాణ అంబేడ్కర్ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుక్క చంద్రమౌళి, శక్తి జిల్లా కన్వీనర్ కళ్ళేపల్లి రవిమాదిగ, దూడ భూమయ్య, సముద్రాల అజయ్, గజ్జెల ఆనందరావు, సుద్దాల లక్ష్మణ్, గోసిక శంకర్, కొయ్యడ వినోధ్, చొప్పదండి లక్ష్మణ్, మాచర్ల బబ్లూ, ఆర్ణకొండ ఈశ్వర్ దాస్, పల్లురి నాగరాజు, సతీష్, కె రవి, గండి గణేష్ కాసరపు కిరణ్, రాచపల్లి సాగర్, సలిగంటి సాగర్, మారంపెల్లి నర్సయ్య, సనీగారపు రాజ మల్లయ్య, మహేష్, కోమురమ్మ, బిక్షపతి, నగేష్, సందీప్, శ్రీశైలం, హన్మంతు, లింగయ్య, భూమయ్య, అంజయ్య కాంతయ్య, తదితరులు పాల్గొన్నారు.