తిరుమలలో మహా శాంతి యాగం

- Advertisement -

తిరుమలలో మహా శాంతి యాగం

Maha Shanti Yagam in Tirumala

తిరుమల
శ్రీవారి ఆలయంలో మహా శాంతి యాగం శాస్రోక్తంగా ప్రారంభమైంది. లడ్డూ వివాదం నేపథ్యంలో ప్రాయశ్చిత కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించడంతో..అందుకు అనుగుణంగా సోమవారం  ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు ఆలయంలో మహా శాంతి యాగాన్ని నిర్వహించారు. . శ్రీవారికి ఉదయం నైవేద్య సమర్పణ జరిగిన అనంతరం బంగారు వాకిలి సమీపంలో ఉన్న యాగశాలలో మూడు యజ్ఞ కుండాలలో మహా శాంతి యాగ క్రతువు ఆర్చకులు ప్రారంభించారు.  ముందుగా పుణ్యా వచన కార్యక్రమాన్ని నిర్వహించి అటు తరువాత మహా శాంతి యాగాన్ని ప్రారంభించారు. చివరగా వాస్తు హోమం నిర్వహించి అనంతరం పంచగవ్య పదార్థాలైన పాలు, పెరుగు, నెయ్యి, పేడ, గోమూత్రంతో అన్నప్రసాద పోటు, లడ్డూ పోటులో సంప్రోక్షణ చేయడంతో మహా శాంతి యాగం ముగిసింది.   8 మంది అర్చకులు, ముగ్గురు ఆగమపండితులుతో పాటు ఈ కార్యక్రమంలో ఈవో శ్యామలరావు దంపతులు పాల్గొన్నారు.  తిరుమల లడ్డూ కల్తీ అంటూ వివాదం చేలరేగిన నేపథ్యంలో మహా శాంతి యాగాన్ని నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఆదేశించడంతో.. శ్రీవారి ఆలయంలో మహా శాంతి యాగాన్ని టీటీడీ నిర్వహించింది. ..

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular