Tuesday, December 24, 2024

ఘ‌నంగా ‘వారధి’ మూవీ ఫ్రీరిలీజ్ ఫంక్ష‌న్

- Advertisement -

ఘ‌నంగా ‘వారధి’ మూవీ ఫ్రీరిలీజ్ ఫంక్ష‌న్

Mainly 'Varadhi' movie pre-release function

మరో యూత్ ఫుల్ థ్రిల్లర్ థియేటర్లలోకి రాబోతుంది. అనిల్ అర్కా, విహారికా చౌదరి జంటగా రాధాకృష్ణ ఆర్ట్స్ బ్యానర్‌పై, పెయ్యాల భారతి, ఎం.డి. యూనస్ నిర్మాతలుగా, శ్రీ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘వారధి’.

ఈ మూవీ ఈ నెల 27న థియేట‌ర్‌ల‌లో విడుద‌ల కాబోతోంది. ఈ సంద‌ర్భంగా తాజాగా ఈ మూవీ హైద‌రాబాద్ ప్ర‌సాద్ ల్యాబ్‌లో ఫ్రీరిలీజ్ ఫంక్ష‌న్ జ‌రుపుకుంది.
ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎర్రచీర మూవీ డైరెక్టర్ సుమన్ మాట్లాడుతూ… “ఇది యూత్ ను ఆకట్టుకునే రొమాన్స్ థ్రిల్లర్ లా ఉంది. కాన్సెప్ట్ బాగుంది. హిట్ కొట్టాడం ఖాయంగా కనిపిస్తోంది. డైరెక్టర్ కు,

చిత్ర యూనిట్ సభ్యులకు శుభాకాంక్షలు.” అని చెప్పారు.
ఈ సందర్భంగా దర్శకుడు శ్రీకృష్ణ మాట్లాడుతూ,
“ఇది ఒక ఎమోషన్ డ్రామా. భార్య భర్త మధ్య ఎలాంటి విభేదాలు రాకుండా భావోద్వేగంగా తతెరకెక్కించాము. కొత్త వాళ్ళతో చేసిన ఈ మూవీ చాలా ఫ్రెష్ గా ఉంటుంది. మన ఇంటి పక్కనే జరుగుతున్నట్టు అనిపిస్తుంది.

చాలా  నాచురల్ గా ఉంటుంది. ఈ నెల 27న విడులవుతున్న ఈ సినిమా అందరు చూడండి. నేను అనుకున్న సబ్జెక్టుకు ప్రొడ్యూసర్ తో సహా ప్రతి ఒక్కరి సపోర్ట్ ఉంది. గుడ్ ఫీల్ మూవీ. కథలో హీరోయిన్ రోల్

ఇంపార్టెంట్. చిత్ర యూనిట్ లో ప్రతి ఒక్కరు బాగా చేశారు. యూత్‌ను ఎట్రాక్ట్ చేసే లవ్, రొమాన్స్ కలిసిన థ్రిల్లర్ కావడంతో అందరికి నచ్చుతుంది. ప్రేక్షకులందరికీ నచ్చే కథను మేం అందించామనే నమ్మకం ఉంది” అని

తెలిపారు.
హీరోయిన్ విహారికా చౌదరి మాట్లాడుతూ… “డైరెక్టర్ ప్రతి ఒక్కరి నుంచి ఫర్ఫెక్ట్ టాలెంట్ తీసుకున్నారు. ప్రొడ్యూసర్స్ సపోర్ట్ ఎంతో ఉంది. చిత్ర యూనిట్ లో అందరి సహకారం వల్లే నేను ఈ సినిమా ఎంతో హ్యాపీగా

చేయగలిగాను.. ” అని అన్నారు.
హీరో అనిల్ అర్కా మాట్లాడుతూ… వారధి మూవీలో నాకు అవకాశం ఇచ్చిన డైరెక్టర్,. ప్రొడ్యూసర్ అందరికి రుణ పడి ఉన్నాను. ప్రతి ఒక్కరు చాలా సపోర్ట్ ఇచ్చారు. భార్యభర్తల మధ్య బంధాన్ని చాలా ఎమోషన్ గా,

ఎట్రాక్టుగా  ఉండబోతుంది. సినిమాని ప్రతి ఒక్కరు ఆదరించాలి. ” అని కోరారు.
‘వారధి’ లో ప్రేమ, భావోద్వేగాలు, సస్పెన్స్ అంశాలను కలిపి ప్రేక్షకులకు స‌రికొత్త అనుభూతిని అందించే ప్రయత్నం చేశారు. చిత్రం ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.సమర్పణ: విబ్గ్యోర్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్

లిమిటెడ్
నటీనటులు:
హీరో: అనిల్ అర్కా
హీరోయిన్: విహారికా చౌదరి
ప్రతినాయక పాత్ర: ప్రశాంత్ మడుగుల
ప్రధాన పాత్ర: రిధి

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్