బలిజ,కాపు,తెలగ ఆత్మీయ సమావేశం కార్యక్రమాన్ని విజయవంతం చేయండి
Make Balija, Kapu, Telugu spiritual meeting program a success– టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బాలి శెట్టి హరిప్రసాద్,కడప మాజీ కార్పొరేటర్ బండి బాబు
బద్వేలు
బద్వేల్ పట్టణంలోని బలిజ సేవ సంఘం కార్యాలయనికి టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బాలి శెట్టి హరిప్రసాద్,కడప మాజీ కార్పొరేటర్ బండి బాబు విచ్చేసి సభ్యులందరికీ ఆహ్వాన పత్రికను అందజేయడం జరిగింది అనంతరం వారు మాట్లాడుతూ 22వ తేదీన మేడా కళ్యాణ మండపంలో జరగబోయే బలిజ,కాపు,తెలగ ఆత్మీయ సమావేశానికి ప్రతి ఒక్కరూ విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా తెలపడం జరిగింది అనంతరం బలిజ సంఘం అధ్యక్షుడు సింగంశెట్టి వెంకటసుబ్బయ్య వారు మాట్లాడుతూ కాపు భవనం కోసం స్థలాన్ని కేటాయించాలని భవనానికి కావాల్సిన నిధులను సమకూర్చాలని తెలిపారు దానితోపాటు కాపు కార్పొరేషన్ కింద ప్రతి ఒక్కరికి లోన్లు వచ్చేలాగా ఏర్పాటు చేయాలని ప్రత్యేకంగా కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ కొరపాటి సురేంద్ర, ప్రధాన కార్యదర్శి కొంకుల రమణ, డా. కొంకుల రాంబాబు,మాజీ బలిజసంఘం అధ్యక్షుడు డివి వెంకటేశ్వర్లు,నానబాల వెంకటేశ్వర్లు,లకిడి విజయభాస్కర్, కొంకుల రవి,కాలవపల్లి సర్పంచ్ శ్రీను, బాచికాల శ్రీనివాసులు,పెద్ది సుధాకర్, కె.ఆర్ తరపున గుర్రాలహరి, తోట రాము,బలిజ సంఘం సభ్యులు తదుపరులు పాల్గొన్నారు



