రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్న మంత్రి కొండ సురేఖ
(వాయిస్ టుడే) సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజే శ్వర స్వామివారిని తెలం గాణ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ కుటుంబ సభ్యులతో కలిసి సోమ వారం దర్శించుకున్నారు.
మంత్రి కొండా సురేఖకు ఆలయ అర్చక బృందం, అధికా రులు ఘనంగా స్వాగతం పలికారు. అంతకుముందు శాసనసభ్యు లు రాష్ట్ర విప్ ఆది శ్రీనివాస్ తో పాటు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆమెకు ఘన స్వాగతం పలికారు.
అనంతరం మంత్రి కుటుంబ సభ్యులు రాజన్నకు కోడే మొక్కు చెల్లించుకుని గర్భ గుడిలో కొలువుదీరిన శ్రీ స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకు న్నారు.
ఆలయ అర్చక బృందం సురేఖ కు, కుటుంబ సభ్యు లకు ఆశీర్వచనం గావించా రు. ఆలయ అధికారులు మంత్రి కుటుంబ సభ్యుల తో పాటు స్థానిక శాసనస భ్యులు ఆది శ్రీనివాస్, మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్ లకు స్వామి వారి ప్రసాదం చిత్రపటాన్ని అందజేసి ఘనంగా సత్కరించారు.