వైకాపాలో చేరిన పలువురు నేతలు
విశాఖపట్నం
జిల్లా ఎండాడ ఎం వీ వీ సిటీ నైట్ స్టే పాయింట్ నుంచి ముఖ్యమంత్రి వైయస్.జగన్ 21వ రోజు బస్సుయాత్ర ప్రారంభమయింది. ఎండాడ ఎంవీవీ సిటీ నైట్ స్టే పాయింట్ వద్ద ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్ సమక్షంలో భారతీయజనతాపార్టీ, టీడీపీ, జనసేన నుంచి పలువరు కీలక నేతలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. భారతీయ జనతాపార్టీ గాజువాక నియోజకవర్గం నుంచి మాజీ మేయర్ పులుసు జనార్ధనరావు, 65వ వార్డు అధ్యక్షుడు వి ఎస్ ప్రకాష్ రావు, ఉపాధ్యక్షుడు కర్రి గోవింద్, కార్యదర్సి గొల్లపల్లి గోవింద్, వరప్రసాదరెడ్డి, సంపత్ కుమార్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. టీడీపీ నుంచి యువజన విభాగం నేత ఏఎన్ఆర్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు . వైయస్సార్సీపీలో చేరిన నేతలకు కండువా వేసి పార్టీలోకి ముఖ్యమంత్రి అహ్వానించారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గాజువాక ఎమ్మెల్యే అభ్యర్ధి గుడివాడ అమర్నాథ్ తదితరులుపాల్గోన్నారు.
వైకాపాలో చేరిన పలువురు నేతలు

- Advertisement -
- Advertisement -