Friday, January 3, 2025

వైకుంఠ ఏకాదశికి భారీగా ఏర్పాట్లు

- Advertisement -

వైకుంఠ ఏకాదశికి భారీగా ఏర్పాట్లు

Massive arrangements for Vaikuntha Ekadashi

తిరుమల, డిసెంబర్ 31, (వాయిస్ టుడే)
తిరుమలలో వైకుంఠ ఏకాదశికి టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఈ సమయంలో అన్నిరకాల ప్రివిలేజ్డ్‌ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ ఈవో స్పష్టం చేశారు. వైకుంఠ ద్వార దర్శనం కోసం భక్తులకు టైంస్లాట్‌ టోకెన్లు జారీ చేస్తామని చెప్పారు.వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని 2025 జనవరి 10 నుంచి శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించనున్నారు. జనవరి 19వ తేదీ వరకు 10 రోజుల పాటు భక్తులకు ఈ అవకాశం ఉంటుంది. ఇందుకోసం విస్తృత ఏర్పాట్లు చేపడుతున్నామని ఆలయన ఈవో జె.శ్యామల రావు తెలిపారు. వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి కీలక విషయాలను వెల్లడించారు. అన్నిరకాల ప్రివిలేజ్డ్‌ దర్శనాలు రద్దవుతాయని చెప్పారు. ఈవో చెప్పిన ముఖ్య విషయాలు ఇక్కడ చూడండి…
దర్శనం కొరకు భక్తులు క్యూలైన్లలో ఎక్కువ సమయం వేచి ఉండాల్సిన అవసరం లేకుండా భక్తులకు టైంస్లాట్‌ టోకెన్లు జారీ చేస్తారు. ఆన్‌లైన్‌లో దర్శనం బుక్‌ చేసుకున్న దాతలను రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన క్యూలైన్‌ ద్వారా దర్శనానికి అనుమతిస్తారు.
సామాన్య భక్తుల సౌకర్యార్థం జనవరి 8 నుండి 11వ తేదీ వరకు దాతలకు గదుల కేటాయింపు ఉండదు. మిగతారోజుల్లో దాతలు యథావిధిగా గదులు బుక్‌ చేసుకోవచ్చు.
ఆఫ్‌లైన్‌లో స్లాటెడ్‌ సర్వదర్శనం టోకెన్లు ఇస్తారు. తిరుపతిలోని 8 కేంద్రాలలో 87 కౌంటర్లు, తిరుమలలో 4 కౌంటర్లు కలుపుకుని మొత్తం 91 కౌంటర్ల ద్వారా టోకెన్లు మంజూరు చేస్తారు.
జనవరి 10, 11, 12 తేదీలకు సంబంధించి మొదటి మూడు రోజులకు జనవరి 9వ తేదీన ఉదయం 5 గం.ల నుండి 1.20 లక్షల టోకెన్లు జారీ చేస్తారు. తదుపరి రోజులకు (13 నుండి 19వ తేదీ వరకు) ఏ రోజుకారోజు ముందు రోజు భూదేవి కాంప్లెక్స్‌, శ్రీనివాసం, విష్ణు నివాసంలలో టోకెన్లు జారీ చేస్తారు.
భక్తుల సౌకర్యార్థం తిరుపతిలో ఇందిరా మైదానం, రామచంద్ర పుష్కరిణి, శ్రీనివాసం కాంప్లెక్స్‌, విష్ణునివాసం కాంప్లెక్స్‌, భూదేవి కాంప్లెక్స్‌, భైరాగిపట్టెడలోని రామానాయుడు ఉన్నత పాఠశాల, ఎంఆర్‌ పల్లిలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, జీవకోనలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, అదేవిధంగా తిరుమల స్థానికుల కొరకు తిరుమల బాలాజీ నగర్‌ కమ్యూనిటీ హాల్‌లో టోకెన్‌ కౌంటర్లు ఏర్పాటు చేస్తారు.
దర్శన టోకెన్లు గల భక్తులను మాత్రమే తిరుమల శ్రీవారి దర్శనానికి అనుమతించడం జరుగుతుంది. చంటిపిల్లల తల్లిదండ్రులతో పాటు వృద్ధులు, దివ్యాంగులు, ఎన్‌ఆర్‌ఐ, రక్షణ సిబ్బంది తదితర ప్రత్యేక దర్శనాలను ఈ పది రోజులపాటు రద్దు చేయడమైనది.
భక్తుల అధిక రద్దీ దృష్ట్యా ఈ 10 రోజులలో వీఐపీ బ్రేక్‌ దర్శనాలకు సిఫార్సు లేఖలు స్వీకరించబడవు, అయితే ప్రోటోకాల్‌ పరిధిలోని ప్రముఖులు స్వయంగా వస్తే వారికి మాత్రం శ్రీవారి దర్శనం కల్పించడం జరుగుతుంది.
జనవరి 7న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరుగుతుంది. జనవరి 10న వైకుంఠ ఏకాదశి నాడు ఉదయం 9 నుండి 11 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు స్వర్ణరథంపై ఆలయ నాలుగుమాడ వీధులలో భక్తులకు దర్శనమిస్తారు.
జనవరి 11న వైకుంఠ ద్వాదశి సందర్భంగా ఉదయం 5.30 నుండి 6.30 గంటల వరకు చక్రస్నానం నిర్వహిస్తారు.
తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబరు 30వ తేదీ నుండి అధ్యయనోత్సవాలు ప్రారంభమవుతాయి. ధనుర్మాసంలో వైకుంఠ ఏకాదశికి 11 రోజులు ముందు నుండి శ్రీవారి సన్నిధిలో అధ్యయనోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్