ఎమ్మెల్యే కొడాలి నాని సమక్షంలో వైకాపా లో భారీగా చేరికలు
గుడివాడ
బుధవారం నాడు ఎమ్మెల్యే కొడాలి నాని సమక్షంలో వైకాపా లో భారీగా చేరికలు జరిగాయి. బీసీ సంఘ నాయకుడు దేవరపల్లి కోటి,150 మంది యువకులకు పార్టీ కండువాలు కప్పి వైసిపిలోకి ఎమ్మెల్యే నాని ఆహ్వానించారు.
ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడుతూ టిడిపికు బీసీలు ఎప్పుడో దూరమైపోయారు.. చంద్రబాబు సామాజిక వర్గం… ఆయన కోటరీకే టిడిపిలో ప్రాధాన్యత. అన్ని విభాగాల్లో బీసీలకు 50% పదవులు ఇస్తున్న ఘనత సీఎం జగన్ దె నని అన్నారు.
చంద్రబాబు సీట్లు అమ్ముకుంటున్నాడు. దానికి నిదర్శనం గుడివాడే. పార్టీ కోసం పని చేసే వారిని కాకుండా…. 150 కోట్లకు గుడివాడ సీటును ఎన్నారైకు అమ్ముకున్నారు. కుక్క కాటుకు చెప్పు దెబ్బలా అమెరికా ఎన్ఆర్ఐకు…. గుడివాడ ప్రజలు బుద్ధి చెబుతారు.ఎంపీ పదవి కోసమే పురందేశ్వరి ఆరాటం. జగన్ ప్రభుత్వం ఇష్టం వచ్చినట్లు అప్పులు చేస్తుందని పురుందేశ్వరి బాధపడుతున్నారు. ఆర్బీఐ నిబంధనల ప్రకారంగానే ఏపీ ప్రభుత్వం అప్పులు చేస్తుంది. పరిమితికి మించి చేసినట్లయితే ఢిల్లీలో ఫిర్యాదు చేయొచ్చు కదా. ఎంపీ అవ్వడానికి బిజెపిను….. టీడీపీకు తాకట్టు పెట్టడానికి పురిందేశ్వరి ప్రయత్నిస్తుందని అన్నారు.
ఎమ్మెల్యే కొడాలి నాని సమక్షంలో వైకాపా లో భారీగా చేరికలు
- Advertisement -
- Advertisement -