- Advertisement -
కూకట్ పల్లి నియోజకవర్గం లో పర్యటించిన మేయర్ విజయలక్ష్మీ
Mayor Vijayalakshmi visited Kukatpally constituency
హైదరాబాద్
జీహెచ్ఎంసి మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ బుధవారం ఉదయం కూకట్ పల్లి నియోజకవర్గంలో పర్యటించారు. మూసాపేట లో స్థానికంగా ఉన్న సమస్యలను అడిగి తెలుసుకునన్నారు. క్షేత్ర స్థాయిలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి కృషి చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. బాలానగర్ లో జరుగుతున్న నాలా పనులను పరిశీలించి ప్రమాదాలు జరగకుండా భద్రత చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అల్లాపూర్ లో పలు అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు సిద్దం చేయాలని ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశం ఇచ్చారు. క్యూబా మజీద్ వద్ద మురికి నీటి కాలువ పనులకు ప్రతిపాదనలు సిద్దం చేయాలని అధికారులకు సూచించారు.
- Advertisement -