Thursday, January 9, 2025

ఫిబ్రవరి 12 నుంచి మేడారం జాతర

- Advertisement -

ఫిబ్రవరి 12 నుంచి మేడారం జాతర

Medaram fair from February 12

హైదరాబాద్, జనవరి 8, (వాయిస్ టుడే)
ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర, తెలంగాణ కుంభమేళాగా పేరొందిన మేడారం సమ్మక్క, సారలమ్మ మినీ జాతర తేదీ ఖరారైంది. ఫిబ్రవరి 12 నుంచి ఫిబ్రవరి 15వరకు మేడారం మినీ జాతర జరగనుందంటూ 2024 అక్టోబర్‌లోనే మేడారం ఆలయ ట్రస్టు షెడ్యూల్‌ను ప్రకటించింది. జాతరకు సంబంధించిన ఏర్పాట్లను ప్రారభించాలని మేడారం పూజారుల సంఘం రాష్ట్ర దేవదాయ శాఖ అధికారులనుకోరింది. కాగా తాజాగా ఈ జాతర ఏర్పాట్లపై అధికారులతో మంత్రి సీతక్క సమీక్ష చేపట్టారు. భక్తులకు సౌకర్యాలు, తదితర అంశాలపై చర్చించారు. ఈ మీటింగ్ కు ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్, ఇతర అధికారులు హాజరయ్యారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలి సీతక్క, అధికారులను ఆదేశించారు.  మేడారం పూజారుల ప్రకారం, నాలుగు రోజులపాటు జరగనున్న ఈ జాతరలో భాగంగా.. ఫిబ్రవరి 12న ఆలయ శుద్ధి, పూజలు, గ్రామ నిర్బంధంతో సహా ఆచారాలు నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 13 న, సమ్మక్క – సారలమ్మ దేవతలను పసుపు, కుంకుమలతో పూజిస్తారు. ఫిబ్రవరి 14, 15న మండమెలిగే కార్యక్రమం జరగనుంది. రాష్ట్రప్రభుత్వం రెండేళ్లకు ఒకసారి మేడారం జాతరను నిర్వహిస్తుండగా.. భక్తుల అభ్యర్థన మేరకు ఇటీవలి కాలంలో మినీ జాతర (మండ మెలిగే)ను నిర్వహిస్తున్నారు. కాకతీయ రాజులకు ఎదురించి పోరాడిన ఆదివాసీ మహిళలు సమ్మక్క, సారక్కలను స్మరించుకునేందుకు ఈ జాతరను నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం తాడ్వాయి మండలంలోని చిన్న మేడారం గ్రామంలో నిర్వహించే సమ్మక్క-సారక్క జాతరకు గిరిజనలతో పాటు, పలు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలివస్తారు.తెలంగాణలో జరిగే ఈ అతిపెద్ద జాతరకు రాష్ట్రం నుంచి మాత్రమే కాకుండా మహారాష్ట్ర, ఒరిస్సా, చత్తీస్ఘఢ్ రాష్ట్రాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు తరలివస్తారు. వనదేవతలకు బంగారం (బెల్లం) రూపంలో తమ మొక్కులు చెల్లించుకుంటారు. ఆ సమయంలో వనంలో కొలువైన వనదేవతకు జనం మధ్యకు రావడంతో అడవంతా జనసంద్రమవుతుంది. అయితే మహా జాతర నిర్వహించిన మరుసటి సంవత్సరం మినీ జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా దేవాదాయ శాఖ అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయనుంది. మౌలిక వసతులు, తాగునీటి సౌకర్యం, టాయిలెట్లు, రవాణా, భద్రత ఏర్పాట్లతో పాటు పలు ఏర్పాట్లు చేయనుంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్