కాకర్లపల్లి జీపి కి వీధిలైట్లు,ఎలక్ట్రికల్ సామాగ్రిని అందజేసిన మెండే రాజయ్య
Mende Rajaiah who presented street lights& electrical supplies to Kakarlapalli GP
-గ్రామానికి తన వంతుగా చేయూత
-మెండే రాజయ్యను ఆదర్శంగా తీసుకొని గ్రామ సేవకు దాతలు ముందుకు రావాలి
మంథని
బతుకమ్మ,దసరా ఉత్సవల్లో భాగంగా గ్రామానికి తన వంతుగా ఏదైనా చేయాలనే తపనతో గ్రామంలో చీకటిని పారదోలెందుకు గ్రామపంచాయతీకి దాదాపు రూ.20 వేల విలువ చేసే వీధిలైట్లు,ఎలక్ట్రికల్ సామాగ్రిని బహుమతిగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు మెండే రాజయ్య అందించారు.
శనివారం మంథని మండలం కాకర్లపల్లి గ్రామానికి చెందిన మెండే రాజయ్య తన సొంత ఖర్చులతో కొనుగోలు చేసిన వీధిలైట్లు, ఎలక్ట్రికల్ సామాగ్రిని పంచాయతీ కార్యదర్శి జోత్స్నరాణి , సిబ్బందికి గ్రామ ప్రజల సమక్షంలో అందజేశారు. ఈ సందర్భంగా మెండే రాజయ్య మాట్లాడుతూ రాష్ట్ర ఐటి,పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు గ్రామపంచాయతీకి ఈ సామాగ్రిని అందజేశామన్నారు. బతుకమ్మ,దసరా ఉత్సవాల్లో వీధి లైట్లు ఇతర పనులకు ఖర్చు చేయడానికి గ్రామపంచాయతిలో సరిపడు నిధులు లేవని మా ద్రుష్టి కి వచ్చిందని,దింతో కాంగ్రెస్ నాయకులందరం సమిష్టిగా కలిసి తెలంగాణ సంస్కృతి, సంప్రదాయలకు అతి పెద్ద పండగ అయిన దసరా, బతుకమ్మ ఉత్సవలల్లో భాగంగా గ్రామంలో బతుకమ్మ ఊరేగింపుగా చెరువు వద్దకు తీసుకవెళ్లి బతుకమ్మను చెరువులో వేయడం జరుగుతుంది కాబట్టి దీనీలో భాగంగా ఉరి నుండి చెరువు గట్టు వరకు చీకటి ఉన్నందున నేను ముందుకు వచ్చి గ్రామపంచాయతీకి వీధి లైట్లను ఎలక్ట్రికల్ సామాగ్రిని అందజేశానని తెలిపారు.గత బిఆరెస్ కాలంలో గ్రామంలో ప్రజలను గ్రామాన్ని గ్రామపంచాయతీ లో ఉన్న నిధులను చూస్తేనే పూర్తిగా నిర్లక్ష్యం చేసినట్టుగా తెలుస్తోందన్నారు. ఎంత మేరకు అవినీతి జరిగిందో కూడా అర్ధం అవుతుందని,ఇంకా గ్రామపంచాయతి సంబందించి లక్షల అప్పులు కూడా ఉన్నట్టు మాకు సమాచారం అందిందన్నారు.ఊర్లో మాత్రమే తూతూ మాత్రంగా పనులు చేసి బిల్లులు కజేసినట్టుగా చూస్తేనే అర్ధం అవుతుందని ఇలాంటి పరిస్థితి భవిష్యత్తులో జరగకుండా మంత్రిదుద్ధిళ్ల శ్రీధర్ బాబు సహాకరంతొ వారి హయాంలో గ్రామాన్ని అభివృద్ధిలో అన్ని హంగుళాలతో ముందుకు తీసుకవెళ్తామన్నారు. గ్రామానికి ప్రజలకు ఎల్లవేళలా నా వంతుగా సేవ చేస్తూనే ఉంటానని ఆయన తెలిపారు.మెండే రాజయ్యను ఆదర్శంగా తీసుకొని గ్రామ సేవకు దాతలు ముందుకు రావాలని ప్రజలు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు కనవేన ఓదెలు, సీనియర్ నాయకులు తన్నీరు లక్ష్మణ్,కనవేన కుమారస్వామి, భాస్కర్ల శంకరయ్య,ఆకుల మధుకర్, ఈసంపల్లి మహేందర్,ఎలగందుల రవి, ఇసంపల్లి మధుకర్,మాదరబోయిన కిషన్, యూత్ నాయకులు ఎలగందుల వెంకటేష్, ఎలకుర్తి మహేష్, గుంటకు గణేష్,లక్కం రమేష్ తోట శ్రీధర్ మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.