Sunday, September 8, 2024

వైకాపాలోకి వలసలు

- Advertisement -

వైకాపాలోకి వలసలు
మైదుకూరు
మాజీ ఆర్టీసీ జోనల్ చైర్మన్ రెడ్యం వెంకటసుబ్బారెడ్డి తన అనుచర గణంతో తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలోకి చేరారు. కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ మైదుకూరు ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామిరెడ్డి ల సమక్షంలో వైసీపీ పార్టీలో చేరారు. మైదుకూరు నియోజకవర్గం కాజీపేట మండలానికి చెందిన సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు  తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి సుమారు 1983 నుండి నేటి వరకు సుమారు 43 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీకి నీతి నిజాయితీతో సేవలు అందించిన తన సేవలను డబ్బుకట్టలతో కనిపించకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు తెలుగుదేశం పార్టీ కోసం ఎన్నో అవరోధాలను అవమానాలను ఎదుర్కొని జైలు జీవితాన్ని కూడా గడిపిన నన్ను అవమానపరుస్తూ  డబ్బు మూటలకే ప్రాధాన్యత ఇచ్చిన తెలుగుదేశం పార్టీ అధినాయకుల ప్రజా వ్యతిరేక చర్యలను  ఎండగట్టేందుకే వైఎస్ఆర్సిపి పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. చెప్పిన మాటకు కట్టుబడి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా  అభివృద్ధి పలాలను ప్రజలకు అందిస్తూ జలకు లబ్ధి చేకూరి తేనే నాకు వెయ్యండి అని ధైర్యంగా ప్రజలను అడుగుతున్న వైయస్ జగన్మోహన్ రెడ్డి నిజాయితీకి ఫిదా అయి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నానని నా చివరి శ్వాస వదిలేంతవరకు జగన్మోహన్ రెడ్డి గెలుపుకు కృషి చేస్తానని చివరి వరకు వైఎస్ఆర్సిపి పార్టీలోనే కొనసాగుతానని  తెలిపారు. రాబోయే ఎన్నికలలో ఎమ్మెల్యే 50 వేల మెజార్టీతో ఎంపీ 5 లక్షల మెజార్టీలో గెలవడం తధ్యమని తెలిపారు.
నేను మరణించిన తర్వాత నా శవం పై తెలుగుదేశం పార్టీ జెండా కప్పి దహన సంస్కారాలు జరపండి అని తెలిపిన రెడ్యం వెంకట సుబ్బారెడ్డి ఎంత మనక్షోభకు గురయ్యాడో… తెలుగుదేశం పార్టీలో నాయకుల పనితీరు ఎలాంటిదో  అర్థం చేసుకోవచ్చని ఎమ్మెల్యే రఘురాం రెడ్డి అన్నారు.
తెలుగుదేశం పార్టీలో ఎంతో నీతి నిజాయితీ నిబద్ధత పనిచేసిన వెంకటసుబ్బారెడ్డి వేలాదిగా ఉన్న తల అనుచర గణంతో వైసీపీ పార్టీలో చేరడం శుభపరిణామం అని ఇలాంటి నిజాయితీగల నాయకుల చేరికతో వైసిపి పార్టీకి బలం పెరిగిందని కడప ఎంపీ అవినాష్ రెడ్డి అన్నారు. ప్రజలు ఎవరికి భయపడకుండా సిపి ప్రభుత్వం లో మీకు మేలు జరిగింటేనే ఓటు వేయండి అని ధైర్యంగా నిజాయితీగా ప్రజలను అడుగుతున్నామని అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్