భవానిపురం లో మంత్రి అనిత పర్యటన
Minister Anita's visit to Bhavanipuram
విజయవాడ
వర్షాభావ స్థితిగతుల నుంచి సాధారణ పరిస్థితులకు చేరే వరకూ ప్రభుత్వం వరద బాధిత కుటుంబాలకు అండగా ఉంటుం దని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. ప్రతి ఒక్కరినీ కాపాడుకుంటామని ఆమె స్పష్టం చేశారు.విజయవాడ భవనీపురం లలితానగర్ ప్రాంతంలో ముంపు ప్రాంతంలోని ప్రజలకు ఆహార పొట్లా లు, నీరు పంపిణీ చేశారు. ట్రాక్టర్ పైన ప్రయాణం చేస్తే ఆ కాలనీ వాసు లకు ఆహారం పంచారు. చిన్నారు లు, మహిళలు, ప్రత్యేక ఇబ్బందికర పరిస్థితులున్న వారి వివరాలు అడి గి తెలుసుకున్నారు. చంద్రబాబు ముందుచూపు, అనుభవంతో ప్రాణ నష్టం లేకుండా బయటపడగలిగా మన్నారు. నీరు అధికంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి డ్రోన్లు, హెలికా ప్టర్ల ద్వారా ఆహారం అందించడం పైన ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు. ఆమెతో పాటు గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా పాల్గొన్నారు.