ప్రచారం రథంపై నుంచి కిందపడ్డ మంత్రి కేటీఆర్‌

- Advertisement -

ఆర్మూర్‌ నవంబర్ 9 :  ఆర్మూరు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రమాదం చోటుచేసుకుంది. ప్రచార రథం రెయిలింగ్‌ విరగడంతో మంత్రి కేటీఆర్‌ ప్రచారం రథంపై నుంచి కిందపడ్డారు. మంత్రి కేటీఆర్‌తోపాటు ఎంపీ సురేష్‌రెడ్డి, ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి కూడా ప్రచార రథంపై నుంచి కిందపడ్డారు. ఈ ప్రమాదంలో మంత్రికి, ఇతర నేతలకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రచారం రథం నడుపుతున్న వ్యక్తి ఒక్కసారిగా బ్రేక్‌ వేయడంతో వాహనం రెయిలింగ్‌ విరిగిపోయింది. దాంతో నేతలకు పట్టుదొరకక కింద పడిపోయారు. ప్రచార రథం రెయిలింగ్‌ విరగగానే భద్రతా సిబ్బంది పట్టుకోవడంతో నేతలకు పెను ప్రమాదం తప్పింది

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular