నిర్మల్ : పాక్ పట్లలో రూ. 300 కోట్లతో నిర్మించనున్న ఆయిల్ ఫామ్ ప్యాక్టరీ కి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేసారు. మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వాల హయాంలో పంటలకు నీళ్ళ కోసం రైతులు తన్నుకునే వారు. తెలంగాణ వచ్చిన తర్వాత ప్రతి ఎకరాకు నీరు అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి కెసిఆర్ దే. ప్రధాని నరేంద్ర మోడీ పంటలు కొనుగోలు చేసినా చేయకపోయినా టిఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం కచ్చితంగా కొనుగోలు చేస్తుంది. ఆయిల్ ఫామ్ పరిశ్రమతో ప్రతి ఒక్కరికి మంచి నూనె అందే అవకాశం ఉంది. తన నియోజకవర్గమైన సిరిసిల్ల రైతులకు ఏదైనా అన్యాయం జరిగితే తనదే బాధ్యత. నిర్మల్, నిజామాబాద్, ఆదిలాబాద్, సిరిసిల్ల జిల్లాలో పండించే ఆయిల్ ఫామ్ పంటను ఇక్కడే కొనుగోలు చేస్తారు. ప్రతి రైతు సంవత్సరానికి రెండు లక్షల ఆదాయం వచ్చే పంట ఆయిల్ ఫామ్ సాగు. రివర్స్ పంపుతో ఎస్సా ఎస్పీ ప్రాజెక్టు నిండుకుండలా మారింది. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించి ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రతి ఒక్కరు అండగా నిలవాలి.