- Advertisement -
కోహెడ మండలం శనిగరం చెరువును పరిశీలించిన మంత్రి పొన్నం ప్రభాకర్
Minister Ponnam Prabhakar inspected Shanigaram Pond of Koheda Mandal
కోహెడ
మంత్రి పొన్నం ప్రభాకర్ కోహెడ మండలం శనిగరం చెరువును పరిశీలించారు. చెరువులో గంగమ్మ కి పసుపు కుంకుమ పూలు వేసి పూజలు చేశారు. గ్రామంలో ఉన్న సమస్యలను గ్రామ ప్రజలు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. గుట్ట నుండి వరద నీరు గ్రామంలోకి, హాస్టల్ లోకి వస్తుందని తెలిపారు. గుట్ట నుండి వచ్చే నీటిని ప్రోక్లెయిన్ ద్వారా డ్రెయిన్ సిస్టమ్ ద్వారా పంపించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. అనంతరం బీసీ హాస్టల్ ను సందర్శించారు. వారికి అందుతున్న ఆహారం వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. హాస్టల్ లో బోర్ కావాలని, టాయిలెట్స్ ఇబ్బంది ఉందన్న సిబ్బంది వెంటనే అధికారులతో మాట్లాడి హాస్టల్ లో విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని సూచించారు. తంగలపల్లి లో డబుల్ రోడ్డు పనులకు విద్యుత్ స్తంభాలు షిఫ్ట్ కోసం ఇప్పటికే 5 లక్షలు సాంక్షన్ చేసినప్పటికీ పనుల అలస్యంపై అధికారుల వివరణ కోరారు. పోల్స్ త్వరగా షిఫ్ట్ చేసి రోడ్డు పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.వాటితో మండలంలోని నారాయణపూర్ శ్రీరాములపల్లి, కోహెడ ల కి బిటి రోడ్లు మంజూరు అయ్యాయని గోట్లమిట్ట, నారాయణపూర్ మధ్య హైలెవల్ బ్రిడ్జి మంజూరు అయినట్టు గ్రామస్థులకు తెలిపారు.పల్లికాయ సబ్సిడీ రాలేదని రైతులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. అధికారులతో మాట్లాడారు.పర్యటనలో కొహెడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మంద ధర్మయ్య, ఇతర కాంగ్రెస్ సీనియర్ నాయకులు, ఎమ్మార్వో సురేఖ, ఎంపిడివో, ఇతర అధికారులు పాల్గొన్నారు.
- Advertisement -