- Advertisement -
భీమదేవరపల్లిలో మంత్రి పొన్నం పర్యటన
Minister Ponnam's visit to Bhimadevarapallyహనుమకొండ
హనుమకొండ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం భీమదేవరపల్లి మండలంలో రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. భీమదేవరపల్లి మండలం గట్ల నర్సింగాపూర్ లో ఇటీవల మరణించిన భీమదేవరపల్లి మండల కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు సామల లింగమూర్తి చిత్రపటానికి నివాళులు అర్పించారు. అనంతరం సామల లింగమూర్తి కుటుంబ సభ్యులను పరామర్శించి వారి కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుల గణన ఇంటింటి కుటుంబ సర్వే పై ఎన్యుమరెటర్స్ వేస్తున్న స్టిక్కరింగ్ ను గట్ల నర్సింగపూర్ లో పరిశీలించారు. కుల గణన పై అధికారులకు సమగ్ర వివరాలు ఇవ్వాలని సమాచారం గోప్యత ఉంటుందని స్థానికులకు తెలిపారు. అనంతరం స్కూల్ కి వెళ్తున్న విద్యార్థులతో ముచ్చటించారు. విద్యార్థులు బాగా చదువుకోవాలని సూచించారు. గట్ల నర్సింగపూర్ లో కూరగాయలు అమ్మతున్న మహిళల తో ముచ్చటించారు. వ్యాపారాలు ఎలా సాగుతున్నాయని ఆరా తీశారు. గ్రామంలో పలు వీధుల్లో తిరుగుతూ ప్రజలతో ముచ్చటిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
- Advertisement -




