కేంద్రమంత్రి శివరాజ్ చౌహన్ తో మంత్రి సీతక్క భేటీ

- Advertisement -

కేంద్రమంత్రి శివరాజ్ చౌహన్ తో మంత్రి సీతక్క భేటీ
న్యూఢిల్లీ
కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో  రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి , మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క భేటీ అయ్యారు.
సీతక్క మాట్లాడుతూ  తెలంగాణలో పెండింగ్ పనులను వెంటనే క్లియర్ చేయాల్సింది,  వెనుకబడిన గిరిజన ప్రాంతాల్లో  ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద రోడ్డు నిర్మించాలని కోరానని అన్నారు. రోడ్డు మార్గం లేని 164కు పైగా ఆదివాసి గిరిజన గూడాలకు రోడ్డు సౌకర్యం కల్పించాలి.  అన్ని మారుమూల ఆవాసాలకు ప్రయోజనం చేకూర్చే విధంగా కేంద్రం చర్యలు తీసుకోవాలి. ఆదివాసి ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం కోసం అటవీ శాఖ అనుమతులు ఇచ్చేలా చొరవ చూపాలి.  ఆదివాసి ప్రాంతాలకు, మారుమూల ప్రాంతాల రోడ్డు నిర్మాణం కోసం తక్షణ నిధులు మంజూరు చేయాలని కోరానని అన్నారు. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ సానుకూలంగా స్పందించారని సీతక్క అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular