
పరకాల (వాయిస్ టుడే) పరకాల నియోజకవర్గంలోని దామెరా మండలం ల్యాదేళ్ల గ్రామానికి చెందిన బీజేపీ పార్టీ నాయకులు పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సమక్షంలో బి.ఆర్.యస్.పార్టీ లో చేరడం జరిగింది.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం లో బి.ఆర్.యస్.పార్టీ తిరుగు లేదని,మళ్ళీ అధికారంలోకి తప్పక వస్తామని ధీమా వ్యక్తం చేసారు. ప్రజలు అభివృద్ధి వైపు ,ఉన్నారని ప్రజలు డిసెంబర్ 03 వ తేదీన బి.ఆర్.యస్. పార్టీ కి ప్రజలు పట్టం కడుతారని అన్నారు..
పార్టీ లో చేరిన వారు కౌడగాని శివ , డెంగు రాజు , వినిత్ , నాగుర్ల నాగరాజు , సూదమల్ల చిరంజీవి , జమాలపురం మహేందర్ , బొల్లోజు శ్రావణ్ , అమరెందర్ , కాశబోయిన శ్రీను దయాకర్ , చెన్నబోయిన పవన్ , కొలిపాక మధు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు మండల నాయకులు కార్యకర్తలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.



