- Advertisement -
ఎమ్మెల్యే కొడాలి నానికు షాక్….. గుడివాడ వైసీపీలో బయటపడ్డ అసమ్మతి సెగ
గుడివాడ
ఎమ్మెల్యే కొడాలి నానికి షాక్ తగిలింది, అక్కడ వైకాపాలో అసమ్మతి బయటపడింది. గుడివాడ వైసీపీ అభ్యర్థిగా ఎంపిక కాబోతున్న హనుమంతరావుకు శుభాకాంక్షలంటూ ప్రధాన కూడళ్లలో బ్యానర్లు వెలిసాయి. వైసిపి జిల్లా ఉపాధ్యక్షుడు మండలి హనుమంతరావుకు సీఎంఓ నుండి పిలుపు వచ్చిందంటు ఫోన్లలో వైసిపి నేతల మాట్లాడుకుంటున్నారు. హనుమంతరావుకు శుభాకాంక్షలు చెబుతూ సోషల్ మీడియాలో ప్రచారం కొనసాగింది. దివంగత వైఎస్ఆర్ కుటుంబానికి వీర విధేయుడుగా హనుమంతరావుకు గుర్తింపు వున్న విషయం తెలిసిందే. పట్టణంలో ఏర్పాటైన బ్యానర్లతో రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
- Advertisement -