కార్పొరేటర్ మందడి శ్రీనివాసరావు
కూకట్ పల్లి ; అక్టోబర్ 28(వాయిస్ టుడే): రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ను అఖండ మెజారిటీతో గెలిపించడమే లక్ష్యంగా కెపిహెచ్బీ డివిజన్ కార్పొరేటర్ మందడి శ్రీనివాసరావు శనివారం 5వ ఫేస్ ఎన్ఎస్ఎల్ నార్త్ బ్లాక్ ప్రాంతంలో ప్రతి ఇంటింటికి తిరుగుతూ ముఖ్యమంత్రి కేసీఆర్, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు హయాంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ 10 ఏళ్ల కాలంలో శాంతిభద్రతల విషయంలో కానీ అభివృద్ధి విషయంలో కానీ ఎక్కడ రాజీ పడకుండా ముఖ్యమంత్రి కేసీఆర్, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ప్రజలకు ఏ లోటు లేకుండా చూసుకుంటున్నారని, అంతేకాకుండా సమస్య ఉందని తెలుపగానే వెంటనే స్పందించి దానికి తగిన నిధులు కేటాయించి సమస్యను పరిష్కరిస్తున్నారని అన్నారు. ఇందులో భాగంగానే భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బంది లేకుండా భూగర్భ నీటి లైన్ నిర్మాణాలు, నూతన రోడ్లు, 24 గంటల విద్యుత్, బస్తీ దవాఖానాలు, పార్కులు, ఇండోర్ స్టేడియంలు, క్రీడా మైదానాలు మొదలగు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేసుకున్నామని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు కృష్ణారెడ్డి, సురేష్ రెడ్డి, సాయిబాబా చౌదరి, కట్టా నరసింహారావు, 5వ ఫేస్ నార్త్ బ్లాక్ అసోసియేషన్ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు, మహిళ నాయకులు పాల్గొన్నారు.




