22.1 C
New York
Friday, May 31, 2024

 తెలంగాణలో 3 రోజులు మోడీ ప్రచారం

- Advertisement -

 తెలంగాణలో 3 రోజులు మోడీ ప్రచారం
హైదరాబాద్, ఏప్రిల్ 25
పార్లమెంట్‌ ఎన్నిల నామినేషన్‌ ప్రక్రియ గురువారం ముగిసింది. దీంతో ఇక ప్రచారం మరింత ఊపందుకోనుంది. ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డి పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సభలు, రోడ్‌షోలు నిర్వహిస్తున్నారు. మరోవైపు బీఆర్‌ఎస్‌ అదినేత కేసీఆర్‌ బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు. ఇక బీజేపీ అభ్యర్థులు కూడా ప్రచారంలో దూకుడు ప్రదర్శిస్తున్నారు. తాజాగా బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేసేందుకు ప్రధాని మోదీ కూడా రంగంలోకి దిగబోతున్నారు. ఈమేరకు షెడ్యూల్‌ ఖరారైంది.ఏప్రిల్‌ 30వ తేదీ, మే 3, 4 తేదీల్లో ప్రధాని మోదీ తెలంగాణలో పర్యటించి లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఈనెల 30 జహీరాబాద్‌లో బహిరంగ సభలో ప్రసంగిస్తారు. తర్వాత శేరిలింగంపల్లిలో ఐటీ కంపెనీ ఉద్యోగులతో ప్రధాని సమావేశమవుతారు. తర్వాత మే 3వ తేదీన వరంగల్‌లో నిర్వహించే బహిరంగ సభలో ప్రధాని పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపారు. అదే రోజు భువనగిరి, నల్లగొండ పార్లమెంటు స్థానాలను కలుపుతూ మరో సభ నిర్వహిస్తారని పేర్కొన్నారు. మే 4వ తేదీన మహబూబ్‌నగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలోని నారాయణపేట, చేవెళ్ల పార్లమెంట్‌ పరిధిలోని వికారాబాద్‌లో మోదీ ప్రచార సభలు నిర్వహిస్తారని వివరించారు.తెలంగాణలో ఈసారి మెజారిటీ స్థానాలపై కమలం పార్టీ కన్నేసింది. పది స్థానాలు టార్గెట్‌గా పెట్టుకుంది. ఈ క్రమంలోనే ఇప్పటికే నామినేషన్‌ కార్యక్రమాల్లో కేంద్ర మంత్రులు పాల్గొంటున్నారు. నామినేషన్లు ముగియగానే ప్రధాని మోదీతోపాటు కేంద్ర మంత్రులు, జాతీయ నాయకులు ప్రచారం చేయనున్నారు. రోడ్‌షోలు, సభలు నిర్వహించనున్నారు. ప్రజలను ఆకట్టుకోవడమే లక్ష్యంగా బీజేపీ దూకుడు పెంచబోతుంది

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!