తండ్రా బాటలోనే మోచ్యూర్డ్..
రాటు దేలుతున్న లోకేష్
గుంటూరు, మార్చి 10, ( వాయిస్ టుడే)
Mothballed on the Tandra trail..
Lokesh is rocking
నారా లోకేశ్.. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో పరిచయం అక్కరలేని నేత. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయకుడు వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చాడు. అయితే ఇంగ్లిష్ మీడియం చదువులు, రాజకీయ అనుభం లేకపోవడంతో మొన్నటి వరకు ఇబ్బంది పడ్డారు. కానీ, ఇప్పుడు బాగా రాటుదేలుతున్నారు. మెచ్యూర్డ్ రాజకీయాలు చేస్తున్నారు.టీపీపీ అధినేత నారా చంద్రబాబు నాయకుడు రాజకీయ వారసుడు నారా లోకేశ్ తండ్రి విజనరీ. భవిష్యత్‌ను అంచనా వేసి పనులు చేయగల నేర్పరి. అయితే ఆయన వారసుడిగా వచ్చిన లోకేష్ తండ్రి వ్యూహాలను అందుకోగలరా అన్న డౌట్లు చాలా మందిలో ఉన్నాయి. టీడీపీలోనూ ఈ విషయంలో అనుమానాలు ఉన్నాయి. అయితే.. అందతా గతం అంటున్నారు లోకేశ్‌ను దగ్గరి నుంచి గమనిస్తున్నవారు. లోకేశ్ ఇప్పుడు బాగా రాటుదేలుతున్నారు. గడిచిన ఐదేళ్లు విపక్షంలో ఉన్న సమయంలో లోకేష్ తనలోని నాయకత్వ ప్రతిభకు పదును పెట్టారు. యువగళంపేరుతో ఆయన చేపట్టిన పాదయాత్ర లోకేశ్‌తోపాటు పార్టీకి మంచి మైలేజీ తెచ్చింది. ఇప్పుడు టీడీపీ వ్యవహారాలను మొత్తం తానే చూసుకుంటున్నాడు. అదే సమయంలో మిత్రపక్షం జనసేనతో బంధం మరింత బలోపతం చేస్తున్నారు. జన సేనాని పవన్ కళ్యాణ్‌ను పవనన్న అని పిలుస్తూ మెచ్యూర్డ్‌గా పాలిటిక్స్ చేస్తున్నారు. ఏ చిన్న అవకాశం వచ్చినా వదలకుండా పవన్‌ను కలుపుకుపోతున్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి మాజీ సీఎం జగన్ కార్పొరేటర్‌కు ఎక్కువ.. ఎమ్మెల్యేకు తక్కువ అని సెటైర్లు వేశారు. దానిపైనా లోకేశ్ రియాక్ట్ అయ్యారు. పవన్ జోలికి వస్తే కబడ్దార్ అని వైసీపీ అధినేతకు మాస్ వార్నంగ్ ఇచ్చారు. పవన్ సత్తా ఏమిటో ఆయన స్థాయి ఏమిటో లోకేశ్ వివరించిన తీరు జనసైనికులను సైతం ఆకట్టుకుంది. మరో అంశంలో కూడా లోకేశ్ జన సేనానిని మనసారా అభినందించారు.ఇక జనసేన తరఫున ఎమ్మెల్సీగా నామినేషన్ వేయడానికి వచ్చిన నాగబాబుతరఫున లోకేశ్ కూడా వచ్చారు. నాగబాబుతో కలిసి అడుగులు వేశారు. ఆయన నామినేషన్ దాఖలుచేసినంతసేపు ఆయన వెంటే ఉన్నారు. నాగబాబుతో కరచాలనం చేసి స్వాగతం పలికారు. ఇవన్నీ లోకేష్ పొలిటికల్ మెచ్యూరిటీకి నిదర్శనం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇక పవన్‌ను… నారా లోకేశ్ పవనన్నా అని వేదికల మీద సంబోధించడం, అల్లుకుపోవడం మిత్రపక్షానికి ఇస్తున్న ప్రాధాన్యతను తెలియజేస్తుంది.నారా చంద్రబాబు నాయకుడు ప్రతీ విషయాన్ని దూరదృష్టితో ఆలోచిస్తారు. ఇప్పుడు లోకేశ్ కూడా తండ్రి బాటలోనే అడుగులు వేస్తున్నారు. మిత్రుల మనసులు ఆకట్టుకుంటున్నారు. ఏపీలోని కూటమి ప్రభుత్వంలో టీడీపీ పెద్ద పార్టీ. జనసేన, బీజేపీ అవసరం లేకుండానే ప్రభుత్వం నడపగలదు. కానీ,లోకేష్ అలా వ్యవహరించడం లేదు. మిత్రపక్షాలకు సముచిత గౌరవం ఇస్తున్నారు. మిత్ర ధర్మం పాటిస్తున్నారు. మిత్రులను దూరం చేసుకోవాలని టీడీపీ అనుకోవడం లేదు. మిత్రులను పల్లెతు మాట కూడా పడనివ్వడం లేదు. వారికి దెబ్బ తగిలితే తనకు తగిలినట్లు భావిస్తున్నారు. అందుకే పవన్, లోకేశ్ వ్యూహాలు అదుర్స్ అంటున్నారు టీడీపీ, జనసేన శ్రేణులు.