సికింద్రాబాద్, అక్టోబర్ 28 (వాయిస్ టుడే ప్రతినిధి): టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైఎస్ఆర్సీపీ ఎంపి గోరంట్ల మాధవ్ కు మతి బ్రహ్మించిందని, ఆయనను వెంటనే మెంటల్ హాస్పిటల్లో అడ్మిట్ చేయించాలని టీడీపి సికింద్రాబాద్ ఇంఛార్జ్ వల్లారపు శ్రీనివాస్ ఏపీ రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఇటీవల కాలంలో ఆయన ప్రవర్తిస్తున్న తీరు ప్రజా స్వామ్యానికే మాయని మచ్చలా ఉందని పేర్కొన్నారు. శనివారం నియోజకవర్గ టిడిపి ముఖ్య నాయకులతో కలిసి సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా వల్లారపు శ్రీనివాస్ మాట్లాడుతూ, గోరంట్ల మాధవ్ ఇప్పటి కైనా తన తీరు మార్చుకోవాలని హెచ్చరించారు. తీరు మారకపోతే టీడీపి తగిన బుద్ధి చెపుతుందని మండిపడ్డారు. చంద్ర బాబు ను విమర్శించే స్థాయి ఆయనకు లేదన్న విషయం తెలుసు కోవాలన్నారు.
నిజాయితీకి సంకెళ్లు వేసి నేటికి 50 రోజులు గడిచినా, జగన్ ప్రభుత్వం ఎలాంటి ఆధారం చూపలేక పోయిందన్నారు. అటువంటప్పుడు చంద్ర బాబు గారు జైల్లో ఎందుకుండాలని అయన ప్రశ్నించారు. జగన్ కక్షపూరిత వైఖరికి టీడీపి తగిన బుద్ది చెప్తుందన్నారు. కార్యక్రమంలో టీడీపి డివిజన్ అద్యక్షులు , కార్యదర్శులు, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఎంపి గోరంట్ల మాధవ్ కు మతిభ్రమించింది: వల్లారపు శ్రీనివాస్
- Advertisement -
- Advertisement -



