మందకృష్ణను కలిసిన మున్నూరుకాపు సంఘం నేతలు
సోమాజిగూడా :వాయిస్ టుడే
Munnurukapu community leaders who met Mandakrishna
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు, పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగను తెలంగాణ మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కొండా దేవయ్య పటేల్ బృందం సోమవారం మర్యాదపూర్వకంగా కలిసింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఓ సమావేశానికి హాజరైన సందర్భంగా మందకృష్ణను కలిసిన మున్నూరుకాపు సంఘం నేతలు మూడు దశాబ్దాలు పోరాటం చేసి వర్గీకరణ సాదించడం పట్ల అభినందనలు తెలిపారు. సమగ్ర కులగణనలో బీసీలకు జరిగిన అన్యాయంపై తమతో గొంతు కలుపాలని మందకృష్ణను కోరగా, అందుకు తన సంపూర్ణ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. మందకృష్ణ మాదిగను కలిసిన వారిలో మున్నూరుకాపు సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ చల్లా హరిశంకర్, తెలంగాణ మున్నూరుకాపు జర్నలిస్టు ఫోరం రాష్ట్ర అధ్యక్షులు కొత్త లక్ష్మణ్ పటేల్,సంఘం మహిళా అధ్యక్షురాలు రంజిత,తెలంగాణ విఠల్,

యువజన అధ్యక్షులు శ్రీరామ్ మధుకర్ పటేల్, సౌత్ ఇండియా కాపు అసోసియేషన్ అధ్యక్షులు వేల్పూరి శ్రీనివాస్, పెరుక రమేశ్, వెంకట్ దాదె పటేల్, ఆకుల బాలకృష్ణ తదితరులు ఉన్నారు.