అకస్మికంగా తనిఖీ చేసిన నంద్యాల జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ

- Advertisement -

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను అకస్మికంగా తనిఖీ చేసిన నంద్యాల జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఆర్ వెంకటరమణ

Nandyala District Medical and Health Department which was inspected randomly

నంద్యాల

నంద్యాల జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి డా ఆర్. వెంకటరమణ  మాయలూరు మరియు నొస్సం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆకస్మికముగా తనిఖీ చేయడం జరిగినది. ప్రాదమిక ఆరోగ్యకేంద్రములో ఉన్నటువంటి ఓపి  గదిని అందులో నిర్వహించుచున్న రికార్డులను, మందుల గదిని రికార్డులను, వార్డు గదిని, ల్యాబ్ ను మరియు వ్యాధినిరోధకాల గదిని అందులో ఉన్నటువంటి రికార్డులను మరియు రిపోర్టులనను తనిఖీ చేయడమైనది. మరియు ప్రాథమిక ఆరోగ్యకేంద్రము లో మరియు ప్రాదమిక ఆరోగ్య కేంద్రం బయట పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా వుంచవలేనని లేనిచో కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని వైద్యాధికారికి మరియు వైద్య ఆరోగ్య సిబ్బందికి హెచ్చరించడమైనది. ఈ తనిఖీ లో భాగముగా మరి ముఖ్యంగా  హెచ్ఎంఐఎస్ పోర్టల్ మరియు  సి ఎస్ ఎస్ ఎం పోర్టల్ నందు మాతా శిశు సంరక్షణ సేవలను ఎప్పుటికప్పుడు అప్లోడ్ చేసి మరియు ఏ ఒక్క మాతా మశ్రీయు శిశు మరణం జరగకుండా మరి ముఖ్యంగా ప్రమాద సంకేత లక్షణాలున్నటువంటి గర్భవతిని సరిఅయిన సమయములో చికిత్స చేసి సరైన సమయములో ఉన్నత ఆసుపత్రికి రెఫర్ చేసి జాగ్రత్తగా ఫాలో అప్ చేయవలెనని ఆదేశాలు జారీచేయడమైనది. వర్షాకాలములో సురక్షితమైన మంచి నీటిని కాచి మరియు వడపోసి త్రాగవలేనని, సచివాలయ ఆరోగ్యకార్యకర్తలు గ్రామ ప్రజలకు అవగాహన కలిగించవలేనని లేనిచో కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించడమైనది.  సిడి మరియు ఎన్ సి డి  కార్యక్రమాన్ని పటిష్టంగా అమలు చేయవలెనని, ఆర్.బి.ఎస్.కె కార్యక్రమాన్ని పటిష్టంగా అమలు చేయవలెనని లేనిచో కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. .

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular