0.1 C
New York
Wednesday, February 21, 2024

మేరు కులస్తుల ఆత్మీయ సమ్మేళనం లో పాల్గొన్న నన్నపునేని

- Advertisement -
మేరు కులస్తుల ఆత్మీయ సమ్మేళనం లో పాల్గొన్న నన్నపునేని

వాయిస్ టుడే వరంగల్

-ఇచ్చిన హామీలన్నీ నిలేబెట్టుకొని జిమ్మేదారీ నాది…
-300గజాల స్థలం కేటాయించా…మీకు ఆత్మగౌరవ భవనం నిర్మిస్తా…

-ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్

వరంగల్ మేరు వెళ్ఫెర్ అసోసియేషన్ మేరు మహిళా పరస్పర సహాయ సహకార సంఘం,రాణి రుద్రమదేవి మేరు మహిళా పరపతి సంఘం,శ్రీ జఠగిరి శంకరదాసమయ్య మేరు మహిళా పరపతి సంఘం శ్రీ సీతారామ మేరు మహిళ పరపతి సంఘం వారి ఆద్వర్యంలో రాజశ్రీ గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనానికి హాజరైన ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్…
ఈ సందర్భంగా నియోజకవర్గ మేర కులస్తులు ముక్తకంఠంతో ఎమ్మెల్యే నరేందర్ కు మద్దతు తెలిపి భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని తెలిపారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…

ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వనా తెలంగాణ గొప్పగా అభివృద్ధి చెందుతుంది సబ్బండవర్గాల అభివృద్ధి ద్యేయంగా కేసీఆర్ బిఆర్ఎస్ సర్కారు పని చేస్తున్నది
తెలంగాణ సర్కారు మేర కులస్తులు గొప్పగా ఆదుకుంటున్నది
వరంగల్ తూర్పు నియోజకవర్గంలో 18 కులసంఘాలకు వారి భవనాల కోసం స్థలం కేటాయించాం మేర కులస్తులకు 300 గజాల స్థలం కేటాయించా మీకు ఆత్మగౌరవ భవనం నిర్మించి ఇచ్చే జిమ్మేదారి నాది నిరిపేదలైన మేర కులస్తులకు గృహలక్ష్మీ,బిసి బంధు,డబ్ బెడ్ రూమ్ అందిస్తాం
-మేర కులస్తులకు ఉపాధి అవకాశాలకు బాటలు వేస్తున్నాం మెగా టెక్స్టైల్ పార్కు ఏర్పాటు చేసుకున్నాం అందులో మనకు 10వేల ఉద్యోగాలు వస్తాయి మీ కులంతో నాకెంతో అనుబంధం ఉంది అని నరేందర్ తెలిపారు ఈ కార్యక్రమంలో మేరు కులస్తులు సంఘీ వెంకట్ రాజం, రామగిరి రాజు, గూడూరు ప్రభాకర్, గూడూరు రాజేష్, రాయబారపు సంతోష్, మాడిశెట్టి మహేష్, మునిగల శ్యామ్, రామగిరి జ్యోతి మరియు మహిళా సంఘాల నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!